Share News

సుందరీకరణ పనులు వేగవంతం చేయండి

ABN , Publish Date - May 15 , 2025 | 12:48 AM

జాతీ య రహదారి డివైడర్‌, ఫుట్‌పాతల సుందరీ కరణ పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులను ఆదేశిం చారు. బుధవారం సుందరీకరణ పనుల ప్రగతిపై విజయవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు.

సుందరీకరణ పనులు వేగవంతం చేయండి
మృతుడు మరీదు గోవిందులు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

మృతుడు మరీదు గోవిందులు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

ప్రసాదంపాడు, మే 14 (ఆంధ్రజ్యోతి) : జాతీ య రహదారి డివైడర్‌, ఫుట్‌పాతల సుందరీ కరణ పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులను ఆదేశిం చారు. బుధవారం సుందరీకరణ పనుల ప్రగతిపై విజయవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ రావతి రాకపోకలు సాగించేందుకు అందుబాటు లో ఉన్న ఏకైక విమానాశ్రయం గన్నవరం కావడంతో పారిశ్రా మిక వేత్తలు, వీఐపీలు వస్తుంటారన్నారు. డివైడర్‌పై మొక్కలు లేని చోట మొక్కలు నాటాలని, ఫుట్‌పాతలపై కుండీలు ఏర్పాటు చేసి వాటిలో మొక్కలు పెట్టాలని అధికారులకు సూచించారు. డివైడర్‌లకు ఆకర్షణీయమైన రంగులు వేసి సుంద రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ జిల్లా డీపీవో ధర్మరాజు పాల్గొన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటా

ప్రమాదవశాత్తు విద్యుత షాక్‌తో మరణించిన మరీదు గోవిందులు కుటుంబ సభ్యులకు రాష్ట్ర విద్యుత శాఖ నుంచి పరిహారంగా రూ. 5 లక్షలు అందేలా చొరవ చూపిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ యార్లగడ్డ వెంకట్రావును బుధవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో మృతిడి కుటుంబ సభ్యులు మార్యదపూర్వకంగా కలిశారు. తమ కుటుంబానికి అండగా నిలిచి పరిహారం అందేలా కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ, కార్యకర్తలకు, అభిమానులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో మృతిడి కుటుంబ సభ్యులు బండారుగూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు కొండేటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికి అన్నదాత సుఖీభవ

గన్నవరం : అర్హులైన రైతులందరికి రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెడుతున్న అన్నదాత సుఖీభవ పథకా న్ని అందజేస్తామని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యార్లగ డ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. మంగళవారం రాత్రి గన్నవరం ఎంపీడీవో కార్యాలయంలో వ్యవసాయ, విద్యుత, ఇంతర అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ పథకం అర్హులైన రైతులందరికి అందించేలా అధికారులు జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

Updated Date - May 15 , 2025 | 12:48 AM