Share News

విద్యార్థులు నూతన టెక్నాలజీని నేర్చుకోవాలి

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:37 AM

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే విద్యార్థులు నూతన టెక్నాలజీని నేర్చుకోవాలని, ఇండస్ర్టీ అవసరాలకు అనుగుణంగా వివిధ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కృష్ణా విశ్వ విద్యాలయం రెక్టార్‌ ఎంవీ బసవేశ్వరరావు తెలిపారు.

విద్యార్థులు నూతన టెక్నాలజీని నేర్చుకోవాలి
విద్యార్థినికి బహుమతి అందజేస్తున్న ఎంవీ బసవేశ్వరరావు, అనురాధ

విద్యార్థులు నూతన టెక్నాలజీని నేర్చుకోవాలి

కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టార్‌ ఎంవీ బసవేశ్వరరావు

లబ్బీపేట, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే విద్యార్థులు నూతన టెక్నాలజీని నేర్చుకోవాలని, ఇండస్ర్టీ అవసరాలకు అనుగుణంగా వివిధ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కృష్ణా విశ్వ విద్యాలయం రెక్టార్‌ ఎంవీ బసవేశ్వరరావు తెలిపారు. నలంద డిగ్రీ కళాశాలలో ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ ఐవోటీ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఎలక్ర్టో 2కే25ను రెండురోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ డిగ్రీ తర్వాత కెరీర్‌ను ఎంచుకునేటపుడు తమ ఆసక్తికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అంద జేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.అనురాధ, వివిధ కళాశాలల విద్యార్థులు, ఎలక్ర్టానిక్స్‌ హెచ్‌వోడీ కె.రామ్‌కుమార్‌, ఎం.అనూష పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 12:37 AM