Share News

సైన్స్‌ విహారయాత్రకు తరలిన విద్యార్థులు

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:39 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సమగ్రశిక్షా ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు గురువారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి హైదరాబాద్‌కు సైన్స్‌ విహారయాత్రకు తరలివెళ్లారు.

సైన్స్‌ విహారయాత్రకు తరలిన విద్యార్థులు
విహారయాత్రకు బయలుదేరిన విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో సుబ్బారావు

సైన్స్‌ విహారయాత్రకు తరలిన విద్యార్థులు

లబ్బీపేట, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సమగ్రశిక్షా ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు గురువారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి హైదరాబాద్‌కు సైన్స్‌ విహారయాత్రకు తరలివెళ్లారు. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన వివిధ వైజ్ఞానిక ప్రదర్శనల్లో ప్రతిభ కనబరిచిన 101మంది విద్యార్థులు, 20మంది గైడ్‌ టీచర్స్‌ ఈ విహారయాత్రకు బస్సుల్లో బయలుదేరగా ఆ బస్సులను జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగా మొదట భవానిపురంలోని రీజనల్‌ సైన్స్‌ సెంటర్‌ను సందర్శించగా, అనంతరం గరికపాడులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోఽధనా క్షేత్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి డాక్టర్‌ మైనం హుస్సేన్‌, ఆంధ్రప్రదేశ్‌ ఫిజికల్‌ సైన్స్‌ ఫోరం కార్యదర్శి పి.నాగేశ్వరరావు, బయాలజీ ఫోరం కార్యదర్శి డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 12:39 AM