కల్తీ మద్యం అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:22 AM
కల్తీ మద్యం సరఫరాను అరికట్టి పెద్ద కంపెనీలు తయారుచేసిన నాణ్యమైన మద్యాన్ని, మద్యం తాగేవారికి అందుబాటులోకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన తెలిపారు.
కల్తీ మద్యం అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు
యాప్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గద్దె
భారతీనగర్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కల్తీ మద్యం సరఫరాను అరికట్టి పెద్ద కంపెనీలు తయారుచేసిన నాణ్యమైన మద్యాన్ని, మద్యం తాగేవారికి అందుబాటులోకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన తెలిపారు. శుక్రవారం తూర్పు పరిధిలోని 10వ డివిజన పంట కాలువ రోడ్డులో ఉన్న ఎస్‌వీడి వైన్సలో విక్రయిస్తున్న మద్యాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన స్వయంగా పరిశీలించారు. కల్తీ మద్యాన్ని అరికట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ మద్యాన్ని తయారుచేయడానికి వీలులేకుండా తమ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుందన్నారు. మద్యం సీసాపై క్యూఆర్ కోడ్‌ను ఆ యాప్ ద్వారా స్కాన చేస్తే ఆ మద్యం కల్తీనా, ఒరిజనలా అనే విషయం తెలుస్తుందన్నారు. స్పిరిట్‌తో మద్యాన్ని తయారుచేసి ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడిన వైసీపీ నాయకులు ఇప్పుడు కల్తీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, ఎక్సైజ్‌శాఖ సీఐ పెద్దిరాజు, లా అండ్ ఆర్డర్ ఎస్‌ఐ వి.భారతి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన తెలిపారు. శుక్రవారం అశోక్‌నగర్‌లోని తూర్పు ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర నియోజకవర్గంలోని పేద కుటుంబానికి చెందిన కొత్తపల్లి కోటేశ్వరరావుకు రూ.25వేలు విలువ చేసే తోపుడు బండిని ఎమ్మెల్యే గద్దె అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారికి తన సొంత నిధులతో సహాయం చేస్తూ వారికి అండగా ఉంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నూతి శ్రీను, కొడే సాంబశివరావు, యలమంచిలి రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.