Share News

ఘనంగా ముగిసిన స్పోర్ట్స్‌ -ఏ-థాన్‌

ABN , Publish Date - Nov 14 , 2025 | 12:40 AM

సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా మొగల్రాజపురం వీపీ సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌లో నిర్వహిస్తున్న క్రీడా వేడుక స్పోర్ట్స్‌ - ఎ -థాన్‌ గురువారంతో ముగిసింది.

ఘనంగా ముగిసిన స్పోర్ట్స్‌ -ఏ-థాన్‌
వీపీఎస్‌ బాలికల జట్టుతో సిద్ధార్థ విద్యాసంస్థల అకడమిక్‌ సలహాదారులు ఎల్‌కే మోహన్‌రావు,ప్రిన్సిపాల్‌ మేడా సీతారామయ్య

ఘనంగా ముగిసిన స్పోర్ట్స్‌ -ఏ-థాన్‌

బాస్కెట్‌బాల్‌ ఓవరాల్‌ చాంపియన్‌

వీపీఎస్‌ బాలికల జట్టు

మొగల్రాజపురం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా మొగల్రాజపురం వీపీ సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌లో నిర్వహిస్తున్న క్రీడా వేడుక స్పోర్ట్స్‌ - ఎ -థాన్‌ గురువారంతో ముగిసింది. బాస్కెట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌ పోటీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగాయి. బాలుర బాస్కెట్‌ బాల్‌ విభాగంలో సెమీఫైనల్స్‌లో వీపీ సిద్ధార్థ జట్టు ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ జట్టుపై 31-13తో గెలుపొంది ఫైనల్‌కు చేరుకుంది. మరో మ్యాచ్‌లో నలందా విద్యానికేతన్‌పై 31-27 స్కోరుతో వివా స్కూల్‌ గుంటూరు గెలుపొంది ఫైనల్స్‌కు చేరింది. ఫైనల్స్‌లో వీపీ సిద్ధార్థ పబ్కిల్‌స్కూల్‌ 44-40 స్కోరుతో వివా స్కూల్‌పై గెలిచి చాంపియన్‌గా నిలిచింది. బాలికల బాస్కెట్‌బాల్‌ విభాగంలో వీపీ సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌ 23 గోల్స్‌తో జిఐజి ఇంటర్నేషనల్‌ స్కూల్‌పై 23 గోల్స్‌తో గెలుపొంది సెమీ ఫైన ల్స్‌కు చేరుకుంది. గన్నవరం సెయింట్‌ జాన్స్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ నలందా విద్యానికేతన్‌పై 22గోల్స్‌తో గెలుపొంది సెమీఫైనల్స్‌కు చేరుకుంది. ఫైనల్‌లో సెయింట్‌ జాన్స్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ 31 గోల్స్‌తో చాంపియన్‌గా నిలిచింది. ముగింపు కార్యక్రమంలో సిద్ధార్థ విద్యాసంస్థల అకడమిక్‌ సలహాదారులు ఎల్‌కే మోహన్‌రావు గెలుపొందిన జట్టుకు రూ.10 వేలు, రన్నర్‌అప్‌గా నిలిచిన జట్టుకు రూ.6వేలు నగదు బహుమతిగా ఇచ్చారు. బాస్కెట్‌ బాల్‌లో ఓవరాల్‌ చాంపియన్‌ వీపీ సిద్ధార్థ జట్టుకు రూ.20వేలు, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్‌ ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచిన వీపీఎస్‌ బాలికల జట్టుకు రూ.20వేలు నగదు బహుమతిని అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ మేడా సీతారామయ్య పోటీల్లో పాల్గోన్న విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2025 | 12:40 AM