వాడపల్లి క్షేత్రానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:06 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అఽధికారి ఎం.వై.దానం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
వాడపల్లి క్షేత్రానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు
బస్టేషన్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అఽధికారి ఎం.వై.దానం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వేకువజామున 4.30 గంటలకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ నుంచి వాడపల్లికి బస్సు బయలుదేరుతుందన్నారు. ఇందుకుగాను ఒక్కొక్కరికి రూ.360 చార్జీ చెల్లించవలసి ఉంటుందన్నారు. భక్తులు తమ టిక్కెట్లను ఆర్టీసీ ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా లేదా తమ సమీప బస్టేషన్‌లలో, ఆర్టీసీ అధీకృత టిక్కెట్ బుక్కింగ్ ఏజెంట్ల వద్ద బుక్ చేసుకోవచ్చన్నారు. వివరాలకు 9959225467 నెంబరులో సంప్రదించవచ్చన్నారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు.