సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Apr 25 , 2025 | 01:26 AM
తమ సమస్యల పరిష్కారానికి నేషనల్ హెల్త్ మిషన్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవల్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (ఏపీఎంసీఏ) ఆధ్వర్యంలో స్థానిక ధర్నాచౌక్‌లో గురువారం చేపట్టిన ధర్నాలో రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, హెల్త్ ప్రొవైడర్లు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ధర్నాచౌక్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : తమ సమస్యల పరిష్కారానికి నేషనల్ హెల్త్ మిషన్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవల్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (ఏపీఎంసీఏ) ఆధ్వర్యంలో స్థానిక ధర్నాచౌక్‌లో గురువారం చేపట్టిన ధర్నాలో రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, హెల్త్ ప్రొవైడర్లు పెద్దఎత్తున పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ రాష్ట్ర కార్యదర్శి సందీ్‌పకుమార్ మాట్లాడుతూ, వైద్య, ఆరోగ్యశాఖలోని ఎన్‌హెచ్‌ఎం కింద సీహెచ్‌వోలుగా విధులు నిర్వర్తిస్తున్న వారు గత రెండేళ్ల నుంచి జీతభత్యాల ఆంశంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరేళ్లు దాటిన సీహెచ్‌వోలను క్రమబద్ధీకరించాలని, ఎన్‌హెచ్‌ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23శాతం ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతీనెల వేతానలతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలని, ప్రతీ ఏడాది 5 శాతం ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. క్లినిక్ అద్దె బకాయిలు వెంటనే చెల్లించి, క్రమబద్ధీకరించాలన్నారు. ఆయుష్మాన్ భారత నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్, స్టేట్ కో-ఆర్డినేటర్ వినోద్‌కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.