మహా నిమజ్జనం
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:28 AM
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యాధరపురంలో ఏర్పాటుచేసిన 72 అడుగుల మట్టి కార్యసిద్ధి మహాగణపతి విగ్రహ నిమజ్జనం శనివారం రాత్రి ఘనంగా పూర్తయ్యింది.
ఘనంగా 72 అడుగుల వినాయక నిమజ్జనం
విద్యాధరపురం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యాధరపురంలో ఏర్పాటుచేసిన 72 అడుగుల మట్టి కార్యసిద్ధి మహాగణపతి విగ్రహ నిమజ్జనం శనివారం రాత్రి ఘనంగా పూర్తయ్యింది. ఉన్నచోటనే ఫైరింజన్ పైపులతో నీళ్లు చల్లి నిమజ్జన కార్యక్రమాన్ని ముగించారు. మధ్యాహ్నం అన్నదానం జరిగింది. సేవా సమితి వ్యవస్థాపకుడు డూండీ రాకేశ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు డి.వెంకట సుబ్బారావు, ఏ.సత్యనారాయణరావు, జీవీబీ రవికుమార్, పి.వెంకట రవికుమార్, ఎన్.నాగేశ్వరరావు, కొత్తా ముత్రేశ్వరరావు, సామా చైతన్య, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.