Share News

జాబ్‌ మార్కెట్‌కు అనుగుణంగా నైపుణ్యాలు

ABN , Publish Date - Oct 17 , 2025 | 12:29 AM

ప్రస్తుతం జాబ్‌ మార్కెట్‌కు అనుగుణంగా యువత నైపుణ్యాలు సముపార్జించాలని, అప్పుడే కెరీర్‌పరంగా ప్రపంచ వ్యాప్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు.

జాబ్‌ మార్కెట్‌కు అనుగుణంగా నైపుణ్యాలు
ఇగ్నైట్‌ సెల్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ లక్ష్మీశ

జాబ్‌ మార్కెట్‌కు అనుగుణంగా నైపుణ్యాలు

ఫ కలెక్టర్‌ లక్ష్మీశ

కలెక్టరేట్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుతం జాబ్‌ మార్కెట్‌కు అనుగుణంగా యువత నైపుణ్యాలు సముపార్జించాలని, అప్పుడే కెరీర్‌పరంగా ప్రపంచ వ్యాప్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. గురువారం జిల్లా నైపుణ్యాభివృద్ధి కార్యాలయం అధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్‌ సెల్‌ను కలెక్టర్‌ లక్ష్మీశ సందర్శించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్‌ఎస్‌డీసీ) ద్వారా అందిస్తున్న సేవలకు సంబంధించిన వివరాలను, సంస్థ కార్యకలాపాలను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ఎస్‌ఎస్‌డీసీ ద్వారా ఎప్పటికప్పుడు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలతో పాటు జాబ్‌మేళాలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రష్యా, జర్మన్‌, ఖతార్‌ తదితర దేశాల్లో కూడా వివిధ ఉద్యోగావకాశాలు పొందేందుకు ఆయా భాషల్లో శిక్షణతో పాటు ఉద్యోగాలు పొందేందుకు చేయూతనందిస్తోం దన్నారు. ఇలాంటి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. కలెక్టర్‌ వెంట జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సీపాన శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు తదితరులున్నారు.

కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించండి

లబ్బీపేట: కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సబ్కా ప్రతినిధులు గురువారం కలెక్టర్‌ లక్ష్మీశను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సబ్కా సభ్యులు మాట్లాడుతూ కాంట్రాక్టర్ల బిల్లులు అప్లొడ్‌, పేమెంట్స్‌పై ఫస్ట్‌ ఇన్‌ ఫస్ట్‌ అవుట్‌ పాటించేలా ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్లు ఆదేశాలు ఇవ్వాలని, తక్షణమే బడ్జెకేటాయింపులు జరిగేలా చూడాలని కోరినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని సబ్కా కృష్ణ కమిటీలతో జాయింట్‌ కమిటీ మీటింగ్‌ ఏర్పాటు చేయడం ద్వారా సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని తమ వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. సబ్కా స్టేట్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ శివకుమార్‌, ట్రెజరర్‌ అప్పారావు, డిప్యూటీ కో ఆర్డినేటర్‌ కూచిపూడి శ్రీనివాసరావు, సబ్కా కృష్ణా ప్రెసిడెంట్‌ మండవ సాయి, సెక్రటరీ పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2025 | 12:30 AM