17న సిద్ధార్థ అకాడమీ నవోన్నేషికోత్సవ్
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:24 AM
సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్ణోత్సవ సంవత్సర కార్యక్రమంగా అంతర్ రాష్ట్ర విద్యార్థుల తో నవోన్నేషికోత్సవ్ పేరుతో అతిపెద్ద యువసృజనోత్సవ్ ఈనెల 17న నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబురావు, డీన్ ఆచార్య రాజేశ్, సి.జంపాల, కల్చరల్ కమిటీ ఉపాధ్యక్షులు డాక్టర్ బి.జయప్రకాష్, ఎం.శివరంజని తెలిపారు.
17న సిద్ధార్థ అకాడమీ నవోన్నేషికోత్సవ్
విజయవాడ కల్చరల్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) :సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్ణోత్సవ సంవత్సర కార్యక్రమంగా అంతర్ రాష్ట్ర విద్యార్థుల తో నవోన్నేషికోత్సవ్ పేరుతో అతిపెద్ద యువసృజనోత్సవ్ ఈనెల 17న నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబురావు, డీన్ ఆచార్య రాజేశ్, సి.జంపాల, కల్చరల్ కమిటీ ఉపాధ్యక్షులు డాక్టర్ బి.జయప్రకాష్, ఎం.శివరంజని తెలిపారు. విజయవాడ పీబీ సిద్ధార్థ క ళాశాలలో సోమవారం ఈ సాంస్కృతిక మేళా పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. కర్ణాటక గాత్రం సోలో, శాస్ర్తీయ వాద్యం, బృందగానం, జానపద గేయాలాపన, ఫోక్ గ్రూప్ డాన్స్, శాస్ర్తీయ నృత్యం, స్కిట్, మైమ్, మిమిక్రీ అంశాల్లో ఈ సాంస్కృతిక మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. విజేతలకు పెద్దమొత్తంలో నగదు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ పోటీల్లో రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా పాల్గొని ప్రతిభను కనబరచాలని వారు కోరారు.