Share News

ప్రకృతి పండుగకు వేళాయె

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:42 AM

ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కనకదుర్గమ్మ మూలవిరాట్‌తో పాటు ఆలయ ప్రాంగణంలోని అన్ని ఉపాలయాల్లో కొలువైన దేవతామూర్తులను మూడు రోజులు రకరకాల కూరగాయలు, ఆకుకూరలతో అలంకరిస్తారు.

ప్రకృతి పండుగకు వేళాయె
కూరగాయలతో తోరణాలు సిద్ధం చేస్తున్న దుర్గమ్మ సేవా సిబ్బంది

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు

మూడు రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు

ఇంద్రకీలాద్రి, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కనకదుర్గమ్మ మూలవిరాట్‌తో పాటు ఆలయ ప్రాంగణంలోని అన్ని ఉపాలయాల్లో కొలువైన దేవతామూర్తులను మూడు రోజులు రకరకాల కూరగాయలు, ఆకుకూరలతో అలంకరిస్తారు. చివరి రోజు శాంతి హోమాలు, పూర్ణాహుతి నిర్వహిస్తారు. శాకంబరీ ఉత్సవాల సందర్భంగా ఆలయంలో అలకరించేందుకు కూరగాయల తోరణాలను సిద్ధంచేసే కార్యక్రమం సోమవారం జరిగింది. 200 మంది వేద పండితులు, అర్చకులు, సిబ్బంది, సహాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈవో శీనానాయక్‌ తొలిపూజ చేసి, కాయగూరల తోరణాలను గుచ్చి ఉత్సవ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు.

ఉదయం 10-2 గంటల వరకు వీఐపీ దర్శనాలకు బ్రేక్‌

శాకంబరీ ఉత్సవాలు, ఆషాఢ సారె సంబరాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వీఐపీల దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఈవో శీనానాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం సజావుగా కల్పించేందుకు తీసుకునే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, సహకరించాలని కోరారు. రూ.500 టికెట్‌తో అంతరాలయ దర్శనాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై దుర్గగుడి దత్తత ఆలయాల ఏఈవో తిరుమలేశ్‌రావును వివరణ అడగ్గా, గూడవల్లి శ్రీకోదండ రామాలయానికి చెందిన భూముల గురించి తనకు పూర్తిగా తెలియదని, ఇటీవలే బాధ్యతలు తీసుకున్నానన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 12:43 AM