Share News

పెడనలో ‘సీవేజ్‌’ ప్లాంట్లు నిర్మిస్తాం

ABN , Publish Date - May 09 , 2025 | 12:43 AM

సీవేజ్‌ ప్లాంట్ల నిర్మాణం కోసం స్థలం సేకరించేందుకు గురువారం తహసీల్దార్‌ కార్యాలయంలో స్థల యజమానులతో ఆర్డీవో స్వాతి సమావేశమయ్యారు.

పెడనలో ‘సీవేజ్‌’ ప్లాంట్లు నిర్మిస్తాం
స్థల యజమానులతో మాట్లాడుతున్న ఆర్డీవో స్వాతి

స్థల సేకరణకు యజమానులను ఒప్పిస్తున్నాం: ఆర్డీవో స్వాతి

పెడన, మే 8 (ఆంధ్రజ్యోతి): ‘మురుగునీటిని మంచినీటిగా మార్చేందుకు పట్టణంలో రెండు సీవేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లు, ఒక నేచురల్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ నిర్మిస్తాం. ఈ మూడు ప్లాంట్ల నిర్మాణానికి 1.77 ఎకరాలు అవసరం. 96 సెంట్లు ఇచ్చేందుకు కొందరు రైతులు అంగీకారం తెలిపారు. మిగిలిన 80 సెంట్లు ఇచ్చేందుకు స్థల యజమానులు ముందుకు రావడం లేదు. వీరిని కూడా ఒ ప్పిస్తాం’ అని ఆర్డీవో కె.స్వాతి తెలిపారు. సీవేజ్‌ ప్లాంట్ల నిర్మాణం కోసం స్థలం సేకరించేందుకు గు రువారం తహసీల్దార్‌ కార్యాలయంలో స్థల యజమానులతో ఆమె సమావేశమయ్యారు. ప్రభుత్వం ఎకరాకు రూ.1.12 కోట్లు ఇస్తుందని, అవసరమైతే దీనికి రెట్టింపు ధర ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉం దని తెలిపారు. మంచి ధర వస్తున్నందున భూము లు ఇవ్వాలని, నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. తమకు రూ.3.50 కోట్లు కావాలని స్థల యజమానులు అడగడంతో ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని ఆర్డీవో తెలిపారు. తహసీల్దార్‌ కె.అనిల్‌కుమార్‌, కమిషనర్‌ ఎం.గోపాలరావు, సర్వేయర్లు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2025 | 12:43 AM