Share News

లింగగూడెంలో తాగునీటి వెతలు

ABN , Publish Date - May 06 , 2025 | 12:49 AM

లింగగూడెంలో ఐడు రోజులుగా గ్రామస్థులు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు.

లింగగూడెంలో తాగునీటి వెతలు
బోరు పంపు నుంచి తాగునీరు తెచ్చుకుంటున్న లింగగూడెం గ్రామస్థులు

పెనుగంచిప్రోలు, మే 5(ఆంధ్రజ్యోతి): లింగగూడెంలోని గ్రామ మంచి నీటి సరఫరా పథకం ఎయిర్‌ వాల్వ్‌ పాడవ్వడంతో ఐడు రోజులుగా గ్రామస్థులు తాగునీటికి కోసం ఇబ్బంది పడుతున్నారు. రోజూ మునేటి నుంచి పైపులైన్‌ ద్వారా లింగగూడెం గ్రామానికి రక్షిత మంచినీటిని సరఫరా చేస్తారు. ప్రస్తుతం సరఫరా లేకపోవడంతో ప్రైవేట్‌ మినరల్‌ వాటర్‌ ప్లాంట్లలో తాగునీటిని గ్రామస్థు లు కొనుగోలు చేస్తున్నారు. మరికొంత మంది చేతి పంపుల వద్ద తాగునీరు తెచ్చుకుంటున్నారు. పాడైన ఎయిర్‌ వాల్వ్‌ను బాగు చేయిస్తున్నామని పంచాయ తీ కార్యదర్శి ఎ.నరేష్‌ తెలిపారు. మంగళవారం నుంచి తాగునీరు ఇస్తామన్నారు.

Updated Date - May 06 , 2025 | 12:49 AM