విద్యార్థుల్లో సృజనాత్మకతకు సైన్స ప్రదర్శన
ABN , Publish Date - Oct 12 , 2025 | 12:54 AM
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేం దుకు సైన్స ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందని ప్రిన్సిపాల్ రాయప్పరెడ్డి తెలిపారు.
విద్యార్థుల్లో సృజనాత్మకతకు సైన్స ప్రదర్శన
ప్రిన్సిపాల్ రాయప్పరెడ్డి
భారతీనగర్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేం దుకు సైన్స ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందని ప్రిన్సిపాల్ రాయప్పరెడ్డి తెలిపారు. పటమట ఎనఎస్‌ఎం పబ్లిక్‌స్కూల్‌లో ఇన్నోవా ఎక్సపో-2025(సైన్స ఎగ్జిబిషన)కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ రాయప్పరెడ్డి, కరస్పాండెంట్ మోంట్‌ఫోర్ట్ ప్రారంభించారు. విజ్ఞానశాస్త్రం, గణితశాస్త్రం, సాంఘికశాస్ర్తాలకు సంబంధించిన ప్రాజెక్టులను, చార్టులను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాయప్పరెడ్డి మాట్లాడుతూ విజ్ఞానశాస్త్రం, గణితశాస్త్రం, సాంఘికశాస్త్ర అంశాలపై ఆసక్తిని పెంపొందించుటకు ఇలాంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ ఎగ్జిబిషనలో ప్రధానంగా డ్రోనషో, రాకేట్‌షో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు 8రకాల రాకెట్లను, అవి పనిచేసే విధానాన్ని ప్రదర్శించారు. వైస్ ప్రిన్సిపాల్ బాలారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.