Share News

మార్గం సుగమం

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:56 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో.. గుంతలు పడి.. కంకరపైకి తేలి.. కాలు వేయాలంటేనే భయపడేలా అగాధంలో ఉండేది ఈ రోడ్డు. ఎన్నో ప్రమాదాలు.. ఎన్నో మరణాలు.. మరెందరో క్షతగాత్రులు.. అడుగు పెట్టాలంటేనే దడ పుట్టించిన గుడివాడ-కంకిపాడు రహదారికి కూటమి ప్రభుత్వ రాకతో మహర్దశ పట్టింది. నాలుగు నియోజకవర్గాల మీదుగా సాగే ఈ రోడ్డు అభివృద్ధికి ఇన్నాళ్లకు అడుగు పడింది. ఇప్పటికే రూ.40 లక్షలతో 2.2 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధిని గత డిసెంబరులోనే పూర్తిచేసిన ప్రభుత్వం.. మరో రూ.5 కోట్లతో 7 కిలోమీటర్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసింది. ఈ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.

మార్గం సుగమం
భూషణగుళ్ల-పెదపారుపూడి మధ్యలో జరుగుతున్న పనులు

గుడివాడ-కంకిపాడు రహదారికి మోక్షం

వైసీపీ హయాంలో ప్రమాదకరంగా మారిన రోడ్డు

సీఆర్‌ఎఫ్‌ నిధులు మంజూరైనా దారి మళ్లింపు

కూటమి ప్రభుత్వ రాకతో రోడ్డుకు మహర్దశ

రూ.5 కోట్లతో 7 కిలోమీటర్ల మేర మరమ్మతులు

రూ.40 లక్షలతో 2.2 కిలోమీటర్ల పనులు పూర్తి

ఆంధ్రజ్యోతి, గుడివాడ : గుడివాడ, పామర్రు, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలో సుమారు 24 కిలోమీటర్ల పొడవున గుడివాడ-కంకిపాడు రహదారి విస్తరించి ఉంది. గత ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో దారి పొడవునా భారీ గుంతలు ఏర్పడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విడతలవారీగా పనులు చేపట్టింది. భూషణగుళ్ల రోడ్డు నుంచి వెంట్రప్రగడ వరకు 7.8 కిలోమీటర్ల మేర మరమ్మతులకు రూ.5 కోట్లు విడుదల చేసింది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబరులోనే రూ.40 లక్షలతో వెంట్రప్రగడ-నందమూరుఅడ్డరోడ్డు వరకు 2.2 కిలోమీటర్ల మరమ్మతులు పూర్తి చేశారు. పరిధిలో 5 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు పూర్తి చేశారు.

వైసీపీ హయాంలో నిధుల దారి మళ్లింపు

టీడీపీ అధికారంలో ఉన్న 2018లో గుడివాడ-కంకిపాడు రహదారి విస్తరణ, అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌ (సీఆర్‌ఎఫ్‌) రూ.165 కోట్లు మంజూరు చేసింది. తొలి ప్యాకేజీగా రూ.16 కోట్లతో గుడివాడ-కంకిపాడు మధ్య నాలుగు నియోజకవర్గాల పరిధిలో 21.6 కిలోమీటర్ల మేర రహదారిని పటిష్టపరిచి, ఇరువైపులా మీటరు వెడల్పు చేయాల్సి ఉండగా, అప్పటి మంత్రి కొడాలి నాని నిధులను దారి మళ్లించారు. గుడివాడ నియోజకవర్గ

అసెంబ్లీలో ఎమ్మెల్యే వెనిగండ్ల ప్రస్తావన

అధ్వానంగా ఉన్న గుడివాడ-కంకిపాడు రహదారిలో జరిగిన ప్రమాదాల చిత్రాలను అసెంబ్లీలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రదర్శించారు. ఈ రహదారికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. నాలుగేళ్లలో 75 ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, 15 మంది మరణించారని, వందల సంఖ్యలో గాయాలపాలై వికలాంగులయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పనులు ఏప్రిల్‌లోపు పూర్తిచేస్తాం : మంత్రి జనార్ధన్‌రెడ్డి

గత ప్రభుత్వం చేసిన పాపాలు ఆర్‌అండ్‌బీ శాఖను వెంటాడుతున్నాయని, రూ.24 కోట్లతో గుడివాడ-కంకిపాడు రహదారి అభివృద్ధి పనులు ప్రారంభమై పురోగతిలో ఉన్నాయని, ఏప్రిల్‌ నాటికి నూరుశాతం పూర్తి చేస్తామని మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి అసెంబ్లీలో హామీ ఇచ్చారు.

Updated Date - Mar 13 , 2025 | 12:56 AM