Share News

19న రన్‌ ఫర్‌ జీసస్‌ శాంతి ర్యాలీ

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:23 AM

ఈస్టర్‌ పర్వ దినాన్ని పురస్కరించుకుని ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలుగు చర్చస్‌, అన్ని క్రైస్తవ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 19న నగరంలో భారీ ఎత్తున రన్‌ ఫర్‌ జీసస్‌ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సీఎస్‌ఐ కృష్ణా, గోదావరి డయాసిస్‌ బిషప్‌ మోస్ట్‌ రెవరెండ్‌ టి.జార్జి కొర్నేలియస్‌ తెలిపారు.

19న రన్‌ ఫర్‌ జీసస్‌ శాంతి ర్యాలీ

19న రన్‌ ఫర్‌ జీసస్‌ శాంతి ర్యాలీ

టీ షర్టుల ఆవిష్కరణ

లబ్బీపేట, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఈస్టర్‌ పర్వ దినాన్ని పురస్కరించుకుని ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలుగు చర్చస్‌, అన్ని క్రైస్తవ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 19న నగరంలో భారీ ఎత్తున రన్‌ ఫర్‌ జీసస్‌ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సీఎస్‌ఐ కృష్ణా, గోదావరి డయాసిస్‌ బిషప్‌ మోస్ట్‌ రెవరెండ్‌ టి.జార్జి కొర్నేలియస్‌ తెలిపారు. బుధవారం బిషప్‌ అజరయ్య స్కూల్‌ గ్రౌండ్స్‌లోని ఆల్‌ సెయింట్‌ చర్చి ఆవర ణలో జరిగిన కార్యక్రమంలో రన్‌ ఫర్‌ జీసస్‌ శాంతి ర్యాలీ టీ షర్టులను ఆవిష్కరించారు. బేతేలు మినిస్ర్టీస్‌ బైబిల్‌ కాలేజీ ప్రెసిడెంట్‌ పాస్టర్‌ సల్లూరి జయకుమార్‌ బాబు మాట్లాడుతూ 19న ఉదయం 6గంటలకు నిర్మలా హైస్కూల్‌ పక్కన ఉన్న సెయింట్‌ పాల్స్‌ కథెడ్రల్‌ చర్చి నుంచి రన్‌ ప్రారరభమై పాలిక్లినిక్‌ రోడ్‌ మీదుగా మదర్‌ థెరిస్సా విగ్రహం, గిరిపురం, శిఖామణి సెంటర్‌ మీదుగా సీఎస్‌ఐ సెయింట్‌ పాల్స్‌ బసిలిక చర్చి ప్రాంగణానికి చేరుకుంటుందని తెలిపారు. ఈ సమావేశంలో పాస్టర్స్‌ అల్లూరి విశ్వప్రసాద్‌, ప్రవీణ్‌ శీలం, బెల్లంకొండ శివాజిరాజు, కరుణానిధి, అశోక్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:23 AM