వంతెనకు మరమ్మతులు చేయండి
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:47 AM
కాజ గ్రామంలో ఐనంపూడి డ్రెయిన్‌పై ఉన్న బ్రెయిలీ బ్రిడ్జి(ఇనుప వంతెన) శిథిలావస్థకు చేరి తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకో వడం లేదని గ్రామస్థులు అంటున్నారు.
కూచిపూడి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): కాజ గ్రామంలో ఐనంపూడి డ్రెయిన్‌పై ఉన్న బ్రెయిలీ బ్రిడ్జి(ఇనుప వంతెన) శిథిలావస్థకు చేరి తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకో వడం లేదని గ్రామస్థులు అంటున్నారు. 1, 2 సంవత్సరాల్లో శాశ్వత వంతెన నిర్మించే వరకు తాత్కాలిక వంతెన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పి పదిహేనేళ్లు గడుస్తోందని, ఇనుప వంతెన శిథిలావస్థకు చేరినా మరమ్మతులైనా చేపట్టకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. వంతెన ప్లాట్‌ఫామ్ రేకులు పగిలిపోయి తేలికపాటి వాహనాలకే వంతెన ఊగిపోతోందని తెలిపారు. మొవ్వ నుంచి మచిలీపట్నం వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం, రైతులు పండించిన పంట ఉత్పత్తులు తరలించేందుకు ఏకైక రహదారి కావటం వల్ల ఈ వంతెనకు ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వంతెన మరమ్మతులు చేపట్టాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.