అన్నదాతలపై ఆశల వాన
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:44 AM
జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం మోస్తరు వర్షం కురిసింది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై బలమైన గాలులతో కూడిన వర్షం పడింది.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం
10 వరకు కురిసే అవకాశం: వాతావరణ శాఖ
రైతుల మోముల్లో ఆనందం
మచిలీపట్నం, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం మోస్తరు వర్షం కురిసింది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై బలమైన గాలులతో కూడిన వర్షం పడింది. కాగా, ఈ నెల 10వ తేదీ వరకు కోస్తాతీరం వెంబడి ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
నారుమడులకు ఊపిరి
వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వేడిగాలులు వీచాయి. దీంతో పైరు బతకడానికి కొంత సమయం పట్టింది. నారుమ డులలో ఎదుగుదల లోపించింది. సోమవారం కురిసిన వర్షంతో పైరుకు కొంతమేర ఊపిరి పోసినట్లయింది.