Share News

యువతకు మార్గదర్శి పుచ్చలపల్లి సుందరయ్య

ABN , Publish Date - May 20 , 2025 | 01:15 AM

నిరాశ, నిస్పృహలకు లోనవుతున్న యువతకు ప్రత్యామ్నాయ ఆలోచనలు, స్ఫూర్తినివ్వడంలో మా ర్క్సిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య మార్గదర్శి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు.

యువతకు మార్గదర్శి పుచ్చలపల్లి సుందరయ్య
సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నేతలు

వర్ధంతి సందర్భంగా సీపీఎం నేతల ఘన నివాళి

గవర్నర్‌పేట, మే 19(ఆంధ్రజ్యోతి): నిరాశ, నిస్పృహలకు లోనవుతున్న యువతకు ప్రత్యామ్నాయ ఆలోచనలు, స్ఫూర్తినివ్వడంలో మా ర్క్సిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య మార్గదర్శి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఎంజీ రోడ్డులోని పార్టీ రాష్ట్ర కార్యాలయం లో సోమవారం సుందరయ్య 40వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిం చారు. సుందరయ్య చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రజానాట్య మండలి కళాకారులు విప్లవగేయాలు ఆలపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కె.సుబ్బరావమ్మ, పా ర్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్‌, నాయకులు కె.ఉమామహేశ్వరరావు, గేయానంద్‌, ఎస్‌. అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శనీయుడు సుందరయ్య

విజయవాడ లీగల్‌: నేటి రాజకీయ నాయకులు పది తరాలకు సం పాదించుకుంటుంటే, పుచ్చలపల్లి సుందరయ్య పది తరాలు బాగుపడాలని రాజకీయా లు చేశారని రాజకీయ నాయకులంతా ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రజాసంక్షేమానికి పాటుపడాలని సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు. బెజవాడ బార్‌ అసోసియేషన్‌లో సోమవారం పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి కార్యక్రమాన్ని న్యాయవాదులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా తమ్మారెడ్డి భరద్వాజ విచ్చేసి, సుందరయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. కామ్రేడ్‌ సుందరయ్య జీవితాన్ని విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చాలని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌(ఐలూ) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, బార్‌ కౌన్సిల్‌ సభ్యు డు సుంకర రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంపర దుర్గా శ్రీనివాసరావు, బెజవాడ బార్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఏకే బాషా, కేవీ రంగారావు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2025 | 01:15 AM