Share News

సర్దుబాటు చార్జీలు, స్మార్ట్‌ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:58 AM

విద్యుత్‌ సర్దుబాటు చార్జీ లు, స్మార్ట్‌ మీటర్లకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తామని, పార్టీలకతీతంగా ప్రజలందరూ ఉద్యమంలో భాగస్వా ములు కావాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూ రావు పిలుపునిచ్చారు.

సర్దుబాటు చార్జీలు, స్మార్ట్‌ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం
ఉద్యమం పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సీపీఎం నేతలు

ప్రజలందరూ భాగస్వాములవ్వండి.. సీపీఎం నేత సీహెచ్‌ బాబూరావు పిలుపు

గవర్నర్‌పేట, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ సర్దుబాటు చార్జీ లు, స్మార్ట్‌ మీటర్లకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తామని, పార్టీలకతీతంగా ప్రజలందరూ ఉద్యమంలో భాగస్వా ములు కావాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూ రావు పిలుపునిచ్చారు. సీపీఎం నగర కమిటీ విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం ఎంజీ రోడ్డులోని బాలోత్సవ్‌లో నిర్వహించారు. సమావేశానికి బి.రమణరావు అధ్యక్షత వహించారు. నగర ప్రజల సమస్యలపై చర్చ జరిపారు. ఇళ్ల పట్టాలు, మంచినీరు, డ్రైనేజీ, పౌర సమస్యలు, కాలుష్యం, గంజాయి, మత్తు పదార్థాలు, ప్రజలపై భారాలు తదితర సమస్యలపై భవిష్యత్తులో ఉద్యమాలు నడపాలని సమావేశంలో నిర్ణయించారు. స్మా ర్ట్‌ మీటర్లను తిప్పి కొట్టాలని సీహెచ్‌ బాబూరావు పిలుపునిచ్చారు. దీని పై ఇంటింటికీ స్టిక్కర్లు, కరపత్రాలతో ప్రచారం నిర్వహిస్తామని తెలిపా రు. విద్యుత్‌ సర్దుబాటు చార్జీల రూపంలో ప్రజలపై భారాలు వేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.కాశీనాథ్‌, కె.శ్రీదేవి, నగర నేతలు బోయి సత్యబాబు, పి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:58 AM