భక్తులకు మెరుగైన సేవలందించండి
ABN , Publish Date - May 20 , 2025 | 01:10 AM
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో భక్తులకు మెరుగైన సేవలందించాలని అధికారులకు ఈవో శీనానాయక్ సూచించారు.
అధికారులతో సమీక్షలో దుర్గగుడి ఈవో శీనానాయక్
ఇంద్రకీలాద్రి, మే 19(ఆంధ్రజ్యోతి): దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో భక్తులకు మెరుగైన సేవలందించాలని అధికారులకు ఈవో శీనానాయక్ సూచించారు. అమ్మవారి సన్నిధిలో ప్రొటోకాల్ విధానం, ఆర్జిత సేవలు, త్వరగా దర్శ నం కల్పించడం, ప్రజారవాణా, తాగునీరు, వివిధ సౌకర్యాల కల్పనపై సోమవారం వివిధ విభాగాల బాధ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇటీవల దేవదాయ శాఖ కార్యదర్శి, కమిషనర్ నిర్వహించిన స మావేశంలో నిర్దేశించిన అంశాలను సిబ్బందికి వివరించారు. భక్తుల సంతృప్తస్ధాయి పెంచడం, గౌరవంగా మెలగడం, సాంకేతికతను ఉపయోగించి భక్తులకు మెరుగైన సేవలు అందించడంపై వివిధ విభాగాల నుంచి వివరాలు తెలుసుకుని సమీక్షించారు. ఈఈ కోటేశ్వరరావు, ఏఈఓలు పి.చంద్రశేఖర్, ఎన్.రమే్‌షబాబు, జె.శ్రీనివాసం పాల్గొన్నారు.