Share News

దుర్గగుడిలో ప్రొటోకాల్‌ దర్శనాలు క్రమబద్ధీకరిస్తాం

ABN , Publish Date - May 18 , 2025 | 01:28 AM

దుర్గగుడిలో ప్రోటోకాల్‌ దర్శనాలు క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకున్నట్టు ఈవో శీనా నాయక్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

దుర్గగుడిలో ప్రొటోకాల్‌ దర్శనాలు క్రమబద్ధీకరిస్తాం

ఈవో శీనా నాయక్‌ ప్రకటన

ఇంద్రకీలాద్రి, మే 17(ఆంధ్రజ్యోతి): దుర్గగుడిలో ప్రోటోకాల్‌ దర్శనాలు క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకున్నట్టు ఈవో శీనా నాయక్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులందరికీ సులభంగా అమ్మవా రి దర్శనం కల్పించడం కోసం భద్రత, తదితర అంశాలను దృష్టిలో ఉం చుకుని ఒక క్రమ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం వివిధ శాఖల నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న విన్నపాల ప్రకారం ప్రొటోకాల్‌ దర్శనాలు జరుగుతున్నాయని, అయితే వాటిని మరికొంత మెరుగ్గా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రొటోకాల్‌ దర్శనాలకు వచ్చే వారంతా దరఖాస్తును పూర్తిచేసి దేవస్థానం అధికారులకు ఇవ్వాలని సూచించారు. దర్శనం తేదీ, ఎప్పుడు..ఎంత మంది వస్తున్నారు. దర్శనానికి వచ్చే ప్రధాన వ్యక్తి పేరు, ఫోన్‌ నెంబరు, వచ్చే వాహనం వివరాలు పూర్తి చేయాలన్నారు. ఆ మేరకు ప్రొటోకాల్‌ దర్శనాలను క్రమబద్ధీకరిస్తామని, దీంతో పాటు పారదర్శకత కూడా ఉంటుందని తెలిపారు. భద్రతా కారణాల రీత్యా తప్పనిసరిగా ఈ విధానాన్ని అమలు చేయాలని ఆయన సిబ్బందికి ఆదేశాలిచ్చారు. వచ్చి న విన్నపాల్లో వారి స్థాయి ప్రకారం ప్రొటోకాల్‌ విభాగం పరిశీలించి దర్శనం ఏర్పాట్లు చూస్తుందన్నారు.

Updated Date - May 18 , 2025 | 01:28 AM