Share News

జగన్‌ ఇంటి ముందు నిరసన తెలపండి

ABN , Publish Date - Mar 13 , 2025 | 01:25 AM

విద్యార్థులను మోసం చేసిన జగన్‌ ఇంటి ముందు వైసీపీ నాయకులు నిరసన తెలపాలి అని తెలుగుయువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బెజవాడ నాగరాజు విమర్శించారు.

జగన్‌ ఇంటి ముందు నిరసన తెలపండి

వైసీపీ నేతలకు తెలుగుయువత నేత బెజవాడ నాగరాజు సూచన

పెడన, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ‘జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండగా విద్యార్థులకు రూ.4వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించలేదు. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయలేదు. ఐదేళ్ల పాటు యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారు. యువతను మోసగించింది చాలక యువత పోరుబాట పేరుతో వైసీపీ కార్యక్రమం నిర్వహించడం సిగ్గుచేటు. విద్యార్థులను మోసం చేసిన జగన్‌ ఇంటి ముందు వైసీపీ నాయకులు నిరసన తెలపాలి.’ అని తెలుగుయువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బెజవాడ నాగరాజు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలోని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.2832 కోట్లు, వసతి దీవెన బకాయిలు రూ. 989 కోట్లు, పీజీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.450 కోట్లు బకాయి పెట్టిందని ఆయన ఆరోపించారు.

Updated Date - Mar 13 , 2025 | 01:25 AM