Share News

సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - May 01 , 2025 | 12:45 AM

తమ సమస్యలు పరిష్కరించాలని సీహెచ్‌వోలు బుధవారం జి. కొండూరు పీహెచ్‌సీ ఎదుట బైఠాయించి ఎండలోనే నిరసన తెలిపారు.

సమస్యలు పరిష్కరించాలి
జి.కొండూరు పీహెచ్‌సీ ఎదుట నిరసన తెలుపుతున్న సీహెచ్‌వోలు

జి.కొండూరు, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కరించాలని సీహెచ్‌వోలు బుధవారం జి. కొండూరు పీహెచ్‌సీ ఎదుట బైఠాయించి ఎండలోనే నిరసన తెలిపారు. కొన్ని నెలలుగా ఉన్న పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆరేళ్లుగా పని చేస్తున్న వారిని రెగ్యులర్‌ చేయాలని, ఈపీఎ్‌ఫను పునరుద్ధరించాలని, నిర్ధిష్టమైన జాబ్‌చార్ట్‌ కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు.

Updated Date - May 01 , 2025 | 12:45 AM