Share News

సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Apr 11 , 2025 | 01:11 AM

ఏపీఎ్‌సఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కరించడంపై యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి నిరసనగా గురువారం మధ్యాహ్నం అవనిగడ్డ డిపో కార్మికులు ధర్నా నిర్వహించారు.

సమస్యలు పరిష్కరించాలి
అవనిగడ్డలో డిపో గ్యారేజీ వద్ద నిరసన తెలుపుతున్న ఆర్టీసీ ఉద్యోగులు

అవనిగడ్డ, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): ఏపీఎ్‌సఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కరించడంపై యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి నిరసనగా గురువారం మధ్యాహ్నం అవనిగడ్డ డిపో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగుల సంఘ జోనల్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి టి.రమేష్‌ ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 మందికిపైగా ఉద్యోగులు భోజన సమయంలో ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. రీజనల్‌ నాయకులు ఎస్వీ నాగేశ్వరరావు, డిపో చైర్మన్‌ జి.ఆర్‌.ఎల్‌.వి.నారాయణ, గ్యారేజీ అధ్యక్ష, కార్యదర్శులు పి.చింతయ్య, పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 01:11 AM