Share News

రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి ప్రాధాన్యత

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:39 AM

ప్రజల అవసరాలకు తగ్గట్టుగా రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తెలిపారు.

రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి ప్రాధాన్యత
స్థానికుల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి ప్రాధాన్యత

5వ డివిజన్లో అభివృద్ధి పనులకు భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె

గుణదల, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ప్రజల అవసరాలకు తగ్గట్టుగా రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తెలిపారు. స్థానిక 5వ డివిజన్లోని బోస్‌గారి ఇంటి వద్ద కొండపైన రూ. 14 లక్షల వ్యయంతో చేపట్టిన రిటైనింగ్‌ వాల్‌, సీసీ డ్రైయిన్‌, రహదారి నిర్మాణ పనులు, రూ. 11 లక్షల వ్యయంతో జయప్రకాష్‌ నగర్లో చేపట్టిన రోడ్డు నిర్మాణానికి గురువారం గద్దె స్థానిక పెద్దలతో కలిసి భూమి పూజ చేశారు. రోడ్ల నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. డివిజన్లో పారిశుధ్య సమస్య ఉందని స్థానికులు తెలియజేశారు దానిపై అధికారులతో మాట్లాడానని చెప్పారు. సమస్య పరిష్కారానికి 50మంది సిబ్బందిని కేటాయించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్‌ అధ్యక్షుడు నందిపాటి దేవానంద్‌, కార్పొరేటర్‌ జాస్తి సాంబశివరావు, పార్టీ నాయకులు, ఈఈ సామ్రాజ్యం పాల్గొన్నారు.

ఆర్‌ఏఎంసీ ఎలిమెంటరీ స్కూల్‌ను

అప్‌గ్రేడ్‌ చేయండి

భారతీనగర్‌: తూర్పు పరిధి ఏపీఐఐసీ కాలనీలోని (ఆటోనగర్‌ పరిధిలోని) రేగుల అనురాధ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఏఎంసీ) ఎలిమెంటరీ స్కూల్‌ను హైస్కూల్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలని కోరు తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ గురువారం మంత్రి నారా లోకేశ్‌కు వినతి పత్రం అందజేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధుల కోరిక మేరకు రానున్న విద్యా సంవత్సరంలోగా అమలులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Updated Date - Mar 21 , 2025 | 12:39 AM