Share News

బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:35 AM

కలెక్టరేట్‌ వద్ద విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న వీహెచ్‌పీ నాయకులు

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్‌ వద్ద విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు కొంత కాలం రాష్ట్రపతి పాలన విధించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. సూరిశెట్టి హరికృష్ణ, వర్రె రాజశేఖర్‌, పులవర్తి శ్రీనివాస్‌, కోట శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 12:35 AM