లాడ్జిలో పిస్టల్ స్వాధీనం
ABN , Publish Date - May 24 , 2025 | 01:17 AM
పట్టణంలోని బైపాస్ జంక్షన్ సమీపంలోని ఎట్‌హోం లాడ్జిలో ఒక వ్యక్తి పిస్టల్‌తో ఉన్నట్లు శుక్రవారం మధ్యాహ్నం సమాచారం రావడంతో సీఐ గిరిబాబు, ఎస్సై కేవీజీవీ సత్యనారాయణ సోదాలు జరిపారు.
తిరువూరు, మే 23(ఆంరఽధజ్యోతి): పట్టణంలోని బైపాస్ జంక్షన్ సమీపంలోని ఎట్‌హోం లాడ్జిలో ఒక వ్యక్తి పిస్టల్‌తో ఉన్నట్లు శుక్రవారం మధ్యాహ్నం సమాచారం రావడంతో సీఐ గిరిబాబు, ఎస్సై కేవీజీవీ సత్యనారాయణ సోదాలు జరిపారు. ఆ వ్యక్తి నుంచి పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..లాడ్జిలో పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించామని, పిస్టల్‌తో ఉన్న వ్యక్తి మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన కొల్లి ఆశోక్‌గా గుర్తించామని తెలిపారు. పిస్టల్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని, అశోక్‌ను అదుపులోకి తీసుకున్నామని, పిస్టల్‌ను పరిశీలన నిమిత్తం పంపామని తెలిపారు.