పింగళి స్ఫూర్తి.. కృష్ణా ఖ్యాతి
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:46 AM
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యను, ఉమ్మడి కృష్ణాజిల్లా ఖ్యాతిని సీఎం చంద్రబాబు కొనియాడారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నగరంలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సోమవారం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం జరగ్గా, ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం.. జాతీయ జెండా ఔన్నత్యాన్ని తెలియజేశారు.
‘హర్ ఘర్ తిరంగా’లో కొనియాడిన సీఎం చంద్రబాబు
పింగళి వెంకయ్య చిరస్మరణీయులంటూ ప్రశంసలు
విజయవాడ సిటీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యను, ఉమ్మడి కృష్ణాజిల్లా ఖ్యాతిని సీఎం చంద్రబాబు కొనియాడారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నగరంలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సోమవారం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం జరగ్గా, ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం.. జాతీయ జెండా ఔన్నత్యాన్ని తెలియజేశారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని రగిల్చేలా జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య కృష్ణాజిల్లాలోని భట్లపెనుమర్రులో జన్మించారని, దేశం కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేశారు. మహాత్మాగాంధీతో సన్నిహిత సంబంధాలను కొనసాగించి, జాతీయ జెండాను రూపొందించి దేశ ప్రజల మనసులో చిరస్మరణీయులుగా నిలిచారని పేర్కొన్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఘనంగా నిర్వహిద్దామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ 2047 నాటికి ప్రపంచంలోనే మనదేశం అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమమహేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య మన ప్రాంతానికి చెందినవారు కావడం మనకు గర్వకారణమన్నారు. అనంతరం సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన, క్రియేటివిటీ, కల్చర్ చైర్‌పర్సన పొడపాటి తేజస్విని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీబీ చైర్మన నెట్టెం రఘురామ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన చైర్మన పట్టాభి, కలెక్టర్ లక్ష్మీశ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, సాంస్కృతిక శాఖ ఈడీ ఎంవీఎస్ మల్లిఖార్జునరావు, నాటక అకాడమీ చైర్మన గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర సమరయోధులు, సైనిక కుటుంబాలకు, క్రీడాకారులకు సత్కారం
స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను, సైనిక కుటుంబాలను, రాష్ర్టానికి చెందిన అంతర్జాతీయ క్రీడాకారులను సీఎం చంద్రబాబు సత్కరించారు. విదేశీ వస్తు బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం తదితర కార్యక్రమాల్లో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుడు గద్దె సత్యనారాయణ భార్య సుశీలను, వీరమహిళ రాంపిళ్ల నరసాయమ్మ కుమారుడు జయప్రకాష్‌ను, యుద్ధంలో మరణించిన సైనికుడు నాగరాజు సతీమణి మంగాదేవికి జ్ఞాపికలు అందజేశారు. అంతర్జాతీయ క్రీడాకారులు టి.సూర్యచరిష్మ, చెరుకూరి డాలీ శివాని, షణ్ముక నాగసాయి, ఎం.భావన, ఎ.దుర్గాసాయిశశాంక్, బి.శిరీష, చిల్లకల్లు స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు జి.వెంకటేశ్వర్లును సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.