విద్యుత్‌శాఖ ద్వారా వేతనాలు చెల్లించండి
ABN , Publish Date - Apr 19 , 2025 | 01:16 AM
విద్యుత్ సంస్థల్లో ఉన్న దళారీ వ్యవస్థను రద్దు చేయాలని, విద్యుత్‌శాఖ ద్వారా వేతనాలు చెల్లించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను ఏపీ విద్యుత్‌శాఖ కాంట్రాక్టు కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి పుట్లూరి నాగార్జున కోరారు.
గుణదల, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): విద్యుత్ సంస్థల్లో ఉన్న దళారీ వ్యవస్థను రద్దు చేయాలని, విద్యుత్‌శాఖ ద్వారా వేతనాలు చెల్లించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను ఏపీ విద్యుత్‌శాఖ కాంట్రాక్టు కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి పుట్లూరి నాగార్జున కోరారు. నగర పర్యటనకు వచ్చిన మంత్రిని శుక్రవారం సంఘం నేతలు కలిసి సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 26వేల మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారని తెలిపారు. సంస్థనే నమ్ముకుని పనిచేస్తున్న వారికి వైద్య సదుపాయాలు, పదవీ విరమణ చేసే వారికి టెర్మినల్ బెనిఫిట్స్ లభించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. పలు చోట్ల వాచ్‌మెన్లు లేకుండా ఆపరేటర్లు ఒక్కరే విఽధులు నిర్వహిస్తున్నారని ఇది చాలా ఇబ్బందిగా ఉందన్నారు.