వృద్ధురాలి ఆత్మహత్య
ABN , Publish Date - May 09 , 2025 | 12:46 AM
పెందుర్రు గ్రామానికి చెందిన వృద్ధురాలు చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది.
బంటుమిల్లి, మే 8(ఆంధ్రజ్యోతి): పెందుర్రు గ్రామానికి చెందిన వృద్ధురాలు చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. ‘గ్రామానికి చెందిన పాలపర్తి విజయలక్ష్మి(70)కి ముగ్గురు కుమార్తెలు, వారికి వివాహా లయ్యాయి. భర్త చనిపోయాడు. ముగ్గురు కూతుళ్ల వ ద్ద ఉంటూ పింఛన్ తీసుకునేందుకు ప్రతి నెలా పెం దుర్రు వస్తోంది. ఎప్పటిలాగానే ఈనెల కూడా పెం దుర్రు వచ్చి పింఛన్ తీసుకుంది. తాను ఎవరికీ భారం కాకూడదని, తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి చెరువు గట్టుపై పెట్టి రజకుల చెరువులో దిగి ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం గ్రామస్థులు చెరువు గట్టువైపు వెళ్లగా శవమై తేలుతోంది. చనిపోవడానికి బలమైన కారణాలు తెలియలేదు.’ అని పోలీసులు తెలిపారు. పోలీసులు శవా న్ని బయటకు తీసి పంచనామా నిర్వహించి పోస్టుమా ర్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెద్ద కుమార్తె నూకల అరుణకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై గణే్‌షకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.