Share News

అయ్యో బిడ్డా..అప్పుడే నిండు నూరేళ్లు నిండాయా!

ABN , Publish Date - May 25 , 2025 | 01:41 AM

అయ్యో బిడ్డా.. అప్పుడే నీకు నూరే ళ్లు నిండిపోయాయా.. అని ఒక్కగానొక్క కొడుకు చెరువులో పడి మృతి చెందడంతో బాలుడి శవంపై పడి ఓ తండ్రి రోదిస్తున్న తీరు చూపరుల్ని కలచివేసింది.

అయ్యో బిడ్డా..అప్పుడే నిండు నూరేళ్లు నిండాయా!
కుమారుడు ఈశ్వర్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న తండ్రి ముదగన కృష్ణ

ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో బాలుడి మృతదేహం వద్ద తండ్రి రోదన

రెడ్డిగూడెం, మే 24 (ఆంధ్రజ్యోతి): అయ్యో బిడ్డా.. అప్పుడే నీకు నూరే ళ్లు నిండిపోయాయా.. అని ఒక్కగానొక్క కొడుకు చెరువులో పడి మృతి చెందడంతో బాలుడి శవంపై పడి ఓ తండ్రి రోదిస్తున్న తీరు చూపరుల్ని కలచివేసింది. ఈ ఘటన నాగులూరులో శనివారం జరి గింది. నాగులూరు గ్రామానికి ముదగన కృష్ణ- నాగలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు ఈశ్వర్‌(10) శుక్రవారం ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంటకు కూడా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు బంధువుల ఇళ్ల వద్ద వెతికారు. బాలుడి కోసం గాలించారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో శుక్రవారం పోలీసులకు బాలుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం గ్రామంలోని సమీపంలోని చేపల చెరువులో బాలుడు మృతదేహం లభ్యమైంది. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి ఎస్సై బి. మోహన్‌రావు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 25 , 2025 | 01:41 AM