ఆర్టీసీ డిపో ఎదుట ఎన్‌ఎంయూ నిరసన
ABN , Publish Date - May 06 , 2025 | 12:43 AM
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయవాడ పశ్చిమ తహసీల్దార్ ఇంతి యాజ్ పాషాకు వినతిపత్రం అంద జేశారు.
బస్‌స్టేషన్, మే 5 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయవాడ పశ్చిమ తహసీల్దార్ ఇంతి యాజ్ పాషాకు వినతిపత్రం అంద జేశారు. ఇటీవల రాష్ట్ర కమిటీ సమా వేశంలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ నిర్ణయించిన ఆందోళనలో భాగంగా సోమవారం విద్యా ధరపురం డిపో కార్యదర్శి పి.శ్రీనివాస రావు, డిపో అసిస్టెంట్ సెక్రటరీ, కార్మికు రాలు సుస్మిత, జాయింట్ సెక్రటరీ విద్యాసాగర్, జిల్లా ప్రచార కార్యదర్శి మల్లేశ్వరావు నాయక్ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను అన్ని స్థాయిల్లోని ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు. అందువల్లే డిపోల పరిధిలో ఉన్న ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి ప్రతాలు ఇవ్వాలన్న నిర్ణయం మేరకు అందజేసినట్టు నాయకులు తెలిపారు.