Share News

జోరుగా..

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:44 AM

యోనెక్స్‌ సన్‌రైజ్‌ 87వ జాతీయ వ్యక్తిగత సీనియర్‌ సీ్త్ర, పురుషుల బ్యాడ్మింటన్‌ సమరం తుది అంకానికి చేరింది. దేశవ్యాప్తంగా అన్ని రాషా్ట్రలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి దాదాపు 500 మందికి పైగా క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించిన ఈ పోటీలు పటమటలోని సీహెచ్‌ఆర్‌కే ఇండోర్‌ స్టేడియంలో జరుగుతున్నాయి.

జోరుగా..
క్వార్టర్‌ ఫైనల్‌లో భార్గవ్‌రామ్‌, విశ్వతేజ్‌ (ఆంధ్రప్రదేశ్‌)

హోరాహోరీగా జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీ

క్వార్టర్‌ ఫైనల్స్‌లో వెనుదిరిగిన టాప్‌ సీడర్లు

నేడు సెమీ ఫైనల్స్‌.. రేపు ఫైనల్స్‌

(ఆంధ్రజ్యోతి, విజయవాడ సిటీ) : యోనెక్స్‌ సన్‌రైజ్‌ 87వ జాతీయ వ్యక్తిగత సీనియర్‌ సీ్త్ర, పురుషుల బ్యాడ్మింటన్‌ సమరం తుది అంకానికి చేరింది. దేశవ్యాప్తంగా అన్ని రాషా్ట్రలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి దాదాపు 500 మందికి పైగా క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించిన ఈ పోటీలు పటమటలోని సీహెచ్‌ఆర్‌కే ఇండోర్‌ స్టేడియంలో జరుగుతున్నాయి. మూడో రౌండ్‌ సింగిల్స్‌, డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో నెగ్గిన క్రీడాకారులు శుక్రవారం ఉదయం ప్రీ క్వార్టర్స్‌ (డ్రా 16) గెలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించారు. మధ్యాహ్నం నుంచి జరిగిన క్వార్టర్స్‌ (డ్రా 8)లో మళ్లీ ప్రత్యర్థులతో సెమీ ఫైనల్స్‌కు చేరారు. రాత్రి 8 గంటల వరకు హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో కొందరు అగ్రశ్రేణి క్రీడాకారు(టాప్‌ సీడర్‌)లు మట్టికరిచారు.

స్కోర్‌ బోర్డు : ప్రీ క్వార్టర్‌ (డ్రా 16) మహిళలు, పురుషుల డబుల్స్‌లో కాగ్‌, తమిళనాడు, మహారాష్ట్ర/కర్ణాటక, తెలంగాణ/తమిళనాడు, మణిపూర్‌/ఉత్తర్‌ప్రదేశ్‌, అసోం, పీఈటీ/మహారాష్ట్ర, కేరళ/తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మణిపూర్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు/కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌/రైల్వే, పుదుచ్చేరి జట్లు గెలిచి క్వార్టర్స్‌కు చేరాయి.

సెమీస్‌కు చేరిన జట్లు

క్వార్డర్‌ ఫైనల్స్‌ మహిళల సింగిల్స్‌లో ఏపీ క్రీడాకారిణి సూర్యచరిష్మ 2-0 తేడాతో టాప్‌ సీడర్‌ ఉన్నతి హుడాను ఓడించి సెమీస్‌కు చేరింది. శృతి ముందాడ (మహారాష్ట్ర), రక్షితశ్రీ (తెలంగాణ), పురుషుల సింగిల్స్‌లో రుత్విక్‌ సంజీవి (తమిళనాడు), కిరణ్‌జార్జ్‌ (ఆర్‌బీఐ), మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అజితసూర్య-అమృత (కర్ణాటక), దీప్‌రంబియా-సోనాలి (మహారాష్ట్ర), సాత్విక్‌రెడ్డి-రాధికశర్మ (తెలంగాణ/పంజాబ్‌), నితిన్‌కుమార్‌-కనిక (రైల్వే) సెమీస్‌కు చేరారు. పురుషుల సింగిల్స్‌లో భరత రాఘవ్‌ (హర్యానా), తరుణ్‌ (తెలంగాణ), మహిళల డబుల్స్‌లో అపర్ణ బాలన్‌ (పీఈటీ)-సిమ్రన్‌ సింగ్‌ (మహారాష్ట్ర) జోడి, ప్రియాదేవి (మణిపూర్‌)-శ్రుతిమిశ్రా (ఉత్తరప్రదేశ్‌) జోడి, వెన్నెల (తెలంగాణ)-రిషిక (తమిళనాడు) జోడి, షికా గౌతమ్‌-అశ్వినిభట్‌ (కర్ణాటక) జోడి, పురుషుల డబుల్స్‌లో హరిహరన్‌-రూబన్‌ కుమార్‌ (తమిళనాడు) జోడి, హర్ష మహమ్మద్‌ (ఉత్తరప్రదేశ్‌)-శంకర్‌ (రైల్వే) జోడి, మితిలేష్‌-ప్రిజాన్‌ (పుదుచ్చేరి), దీప్‌ రంబియా (మహారాష్ట్ర)- సూర్య (కర్ణాటక) జోడీ సెమీస్‌కు చేరాయి. శుక్రవారం రాత్రి వరకు క్వార్టర్‌ ఫైనల్‌ పోటీలు సాగాయి. శనివారం సెమీఫైనల్‌ పోటీలు జరుగుతాయని, ఆదివారంతో పోటీలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Dec 27 , 2025 | 12:44 AM