నరసాపురం బస్సు అమలాపురం వరకు పొడిగింపు
ABN , Publish Date - May 08 , 2025 | 01:03 AM
అవనిగడ్డ డిపో నుంచి ప్రస్తుతం నడుపుతున్న నాగాయలంక-నరసాపురం బస్సు సర్వీసును ఈ నెల 9వ తేదీ నుంచి అమలాపురం వరకు పొడిగిస్తున్న ట్టు డిపో మేనేజర్ కె.హనుమంతరావు తెలిపారు.
అవనిగడ్డ, మే 7(ఆంధ్రజ్యోతి): అవనిగడ్డ డిపో నుంచి ప్రస్తుతం నడుపుతున్న నాగాయలంక-నరసాపురం బస్సు సర్వీసును ఈ నెల 9వ తేదీ నుంచి అమలాపురం వరకు పొడిగిస్తున్న ట్టు డిపో మేనేజర్ కె.హనుమంతరావు బుధవా రం తెలిపారు. నాగాయలంక నుంచి ఉదయం 6.20 గంటలకు బయలుదేరి 6.50కు అవనిగడ్డ వస్తుందని, మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివె న్ను, భీమవరం, పాలకొల్లు, రాజోలు మీదుగా అమలాపురం వెళ్లి మధ్యాహ్నం 1.40 గంటలకు బయలుదేరి అదే మార్గంలో నాగాయలంక, అవనిగడ్డ చేరుతుందని తెలిపారు.