బియ్యం దొంగ పేర్ని నాని
ABN , Publish Date - May 18 , 2025 | 01:25 AM
టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయం లో విలేకరుల సమావేశంలో మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నానీతో కలిసి గోపీచంద్ మాట్లాడారు.
మంత్రి కొల్లు రవీంద్రపై అసత్య ప్రచారాలు మానుకోవాలి
త్వరలో ఆయన జాతకమంతా బయటకొస్తుంది
టీడీపీ నేత గొర్రెపాటి గోపీచంద్
మచిలీపట్నం టౌన్, మే 17 (ఆంధ్రజ్యోతి): ‘మాజీ మంత్రి పేర్ని నానీ..బియ్యం దొంగ. త్వరలో ఆయన జాతకాన్ని బయటపెడతాం. మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి పక్కన బెల్టుషాపు ఉందంటూ ఆయనపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు. అసత్యప్రచారం మానుకోవాలి’. అని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్ హితవు పలికారు. శనివారం టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయం లో విలేకరుల సమావేశంలో మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నానీతో కలిసి గోపీచంద్ మాట్లాడారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, ధర్మారెడ్డి మాటలు వినేవారన్నారు. అయినా వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పేర్ని నానీ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. బందరు పోర్టు నిర్మించకపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పి మాట తప్పారన్నారు. ఏదో ఒకటి మాట్లాడితే గానీ మీడియాలో గుర్తింపు ఉండదని భావించి కొల్లు రవీంద్రపైన అసత్యాల బురద చల్లుతున్నారన్నారు. వైసీపీ హయాంలో గంజాయి, నాటుసారా విస్తృతంగా అమ్మకాలు జరిగాయని, కొల్లు రవీంద్రను విమర్శించే నైతిక హక్కు పేర్ని నానీకి లేదని కుంచే నాని అన్నారు. మచిలీపట్నాన్ని మంత్రి అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే ఓర్వలేక పేర్ని నానీ మతిస్థిమితం కోల్పోయారని, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, కొల్లు రవీంద్రపై చేసిన విమర్శలను వెనక్కి తీసుకోవాలని టీడీపీ మైనారిటీ సెల్ నాయకుడు ఖాజా, రత్నాకర్, గోకుల శివ, కార్పొరేటర్లు మరకాని సమతాకీర్తి, దేవరపల్లి అనిత డిమాండ్ చేశారు.