Share News

వృద్ధురాలి అనుమానాస్పద మృతి కేసులో వీడిన మిస్టరీ

ABN , Publish Date - Apr 26 , 2025 | 01:07 AM

యనమలకుదురు కృష్ణానది లంకగట్టుపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వృద్ధురా లి కేసు మిస్టరీ వీడింది.

వృద్ధురాలి అనుమానాస్పద మృతి కేసులో వీడిన మిస్టరీ
పెనమలూరు స్టేషన్‌లో వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ గంగాధరరావు

యనమలకుదురులో వృద్ధురాలిని అంతమొందించిన మహిళ, ఆమె స్నేహితుడు.. అంతకుముందు మృతురాలి కొడుకును మెదక్‌లో హత్య చేసిన నిందితులు

కొడుకు ఆచూకీపై ప్రశ్నించడంతో వృద్ధురాలి హత్య

పెనమలూరు పోలీసుల అదుపులో నిందితులు

పెనమలూరు, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): యనమలకుదురు కృష్ణానది లంకగట్టుపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వృద్ధురా లి కేసు మిస్టరీ వీడింది. శుక్రవారం పెనమలూరు పోలీసుస్టేషన్‌లో ఎస్పీ గంగాధరరావు కేసు వివరాలను వివరించారు. ‘యనమలకుదురులో అనుమానాస్పదంగా మృతి చెందిన వృద్ధురాలు పోతుల పోచమ్మ స్వ గ్రామం మెదక్‌ జిల్లాలోని ఘన్‌పూర్‌ మండలం గంగాపూర్‌. ఆమె కుమారుడు మహేష్‌, వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. అదే గ్రామానికి చెం దిన బండి శోభతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. శోభకు మహేష్‌ బంగారు గొలుసు ఇచ్చాడు. గొలుసును తాకట్టుపెట్టగా వచ్చిన డబ్బును శోభ ఖర్చు చేసింది. తన గొలుసు ఇవ్వాలని మహేష్‌ ఒత్తిడి చేస్తుండడంతో అప్పటికే తనకు పరిచయమున్న మరో స్నేహితుడు మామిడి గోపాల్‌తో కలిసి మహే్‌షను అంతమొందించేందుకు కుట్ర ప న్నింది. మహే్‌షను నమ్మించి వారిద్దరూ మెదక్‌ జిల్లా ఏడుపాయల వం తెన దగ్గర్లో ఉన్న పోతంశెట్టిపల్లె వద్దకు తీసుకెళ్లారు. ఊరు చివర వాగు లో రాయి మీద కూర్చొని కల్లు తాగుతుండగా కిందికి నెట్టేసి అతని మెడ లోని తుండును మెడకు బిగించి చంపి, అక్కడే వదిలేశారు. తన కుమారుడు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి గోపాల్‌ను శోభను పోచమ్మ నిలదీసింది. నిజం చెప్పకపోతే కేసు పెడతానని బెదించింది. దీంతో వారిద్దరూ మహేష్‌ విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్లి ఉంటాడని నమ్మించారు. యనమలకుదురు గ్రామానికి ఈనెల నాలుగున తీసుకొచ్చారు. శోభను, పోచమ్మను హోసన్నా మందిర్‌ వద్ద ఉంచి దగ్గరలోని మద్యం షాపులో మద్యం తెచ్చి గోపాల్‌ ఇచ్చాడు. కృష్ణానదిలో ఇసుక పనులకు మహేష్‌ వెళ్లి ఉంటాడని నమ్మించారు. గ్యాస్‌ గోడౌన్‌ రోడ్డులోని కృష్ణానది లంక గట్టు మీదికి ఉదయం తీసుకెళ్లి పోచమ్మకు లోబీపీ కి దారితీసే ట్యాబ్లెట్లు కలిపిన కల్లు ఇచ్చారు. షాపులో కొన్న మద్యాన్ని గోపాల్‌, శోభ తాగారు. కల్లు తాగిన పోచమ్మ బీపీ డౌనవడంతో స్పృహ తప్పి కింద పడిపోయింది. ఆమె చీరను మెడకు బిగించి చంపేసి చెవుల కు ఉన్న బంగారు దిద్దులు తీసేసుకున్నారు. ముక్కుపుడకను తీయడానికి ప్రయత్నించినా రాకపోవడతో మృతదేహాన్ని అక్కడే పడేసి రైలు ఎక్కి మెదక్‌ వెళ్లిపోయారు.’ అని ఎస్పీ తెలిపారు. బండి గోపాల్‌ అక్క బావ బతుకుదెరువు కోసం యనమలకుదురు వచ్చి స్థిరపడ్డారని, వారి ఇంటికి రెండు మూడుసార్లు గోపాల్‌, శోభ వచ్చి వెళ్లారని ఈ పరిసరాలు తెలిసి ఉండడం వల్ల పోచమ్మను ఇక్కడికి తీసుకొచ్చి అంతమొందించారని పోలీసులు చెబుతున్నారు. నిందితుల కోసం పెనమలూరు పోలీసులు మెదక్‌లో విచారిస్తుండగా..మెదక్‌ పోలీసులు విచారిస్తున్నారనుకుని భయపడి వారిద్దరూ యనమలకుదురులో తలదాచుకుందామ ని వచ్చారు. చింతలకట్ట వద్ద దుకాణంలో కల్లు తాగుతుండగా పెనమలూరు పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 01:07 AM