9వ రోజుకు మున్సిపల్ కార్మికుల సమ్మె
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:21 AM
జీతాలపెంపు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) నగరకమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మె గురువారం తొమ్మిదో రోజుకు చేరింది.

ధర్నాచౌక్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): జీతాలపెంపు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) నగరకమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మె గురువారం తొమ్మిదో రోజుకు చేరింది. ధర్నాచౌక్‌లో కార్మికులు వేపాకులు కట్టుకుని, మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గౌరవాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ చర్చల పేరుతో కాలయాపన చేయకుండా జీతాల పెంపునకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. జ్యోతిబసు, స్టీఫెన్‌బాబు, టి.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.