Share News

మునిసిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - May 27 , 2025 | 12:46 AM

మునిసిపల్‌ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సోమవారం కలెక్టర్‌ డీకే బాలాజీకి ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూ నియన్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు.

మునిసిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కలెక్టర్‌ డీకే బాలాజీకి వినతిపత్రం ఇస్తున్న సీఐటీయూ నాయకులు

మచిలీపట్నం టౌన్‌, మే 26(ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సోమవారం కలెక్టర్‌ డీకే బాలాజీకి ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూ నియన్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. కార్పొరేషన్‌ పరిధిలో 600 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరికి రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సబ్బు లు, చెప్పులు, కొబ్బరినూనె వెంటనే అందజేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బూర సుబ్రహ్మణ్యం కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సరెండర్‌ లీవులు, డీఏలు ప్రభుత్వం కోత పెడుతోందని వివరించా రు. యూనియన్‌ అధ్యక్షురాలు సీహెచ్‌ బుల్లెమ్మ, సీఐటీయూ నాయకు డు సీహెచ్‌ జయరావు, గుర్రం నాగేశ్వరమ్మ, లక్ష్మీకుమారి పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2025 | 12:46 AM