మణిశర్మ మ్యూజిక్ మస్తీ
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:50 AM
మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజికల్ బీట్స్ మోత మోగించాయి. గొల్లపూడి ఎక్స్‌పోలో సోమవారం మణిశర ్మ తన మెలోడీ పాటలతో యువతను హుషారెత్తించారు. ఆయన పాడిన పాటలకు యువకులు డ్యాన్సులు చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు పాల్గొని ప్రసంగించారు.
గొల్లపూడి ఎక్స్‌పోలో హుషారెత్తిన పాటలు
మణిశర్మ పాటలకు డ్యాన్స్ చేసిన యువకులు
ఘనంగా విజయవాడ ఐడల్, చాంప్స్ ఫైనల్స్
ఐడల్ విన్నర్ రెహన్, చాంప్స్ విన్నర్ నలందా స్కూల్ గ్రూప్
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజికల్ బీట్స్ మోత మోగించాయి. గొల్లపూడి ఎక్స్‌పోలో సోమవారం మణిశర ్మ తన మెలోడీ పాటలతో యువతను హుషారెత్తించారు. ఆయన పాడిన పాటలకు యువకులు డ్యాన్సులు చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు పాల్గొని ప్రసంగించారు. పున్నమిఘాట్‌లో విజయవాడ ఐడల్ ఫైనల్స్ దుమ్ముదులిపాయి. క్లాసికల్ డ్యాన్స్, ఫోక్, ఫ్రీస్టయిల్, వోకల్ మ్యూజిక్, పెర్క్యూసన్ ఇన్‌స్ర్టుమెంట్ ్స (వాయిద్యాల ప్రదర్శన) వంటి వాటికి సంబంధించి సోలో కేటగిరీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రూప్ కేటగిరీలో విజయవాడ చాంప్స్ నిర్వహించారు. మొత్తం 1,000 మంది పాల్గొన్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో కేఎల్ యూనివర్సిటీలో విజయవాడ ఐడల్ , విజయవాడ చాంప్స్ విభాగాల్లో పోటీలు జరగ్గా, సోమవారం పున్నమిఘాట్‌లో ఫైనల్స్ నిర్వహించారు. విజయవాడ ఐడల్ విజేతగా రెహన్, రన్నర్‌గా మైథిలి, విజయవాడ చాంప్స్ విన్నర్‌గా నలందా స్కూల్ గ్రూప్, రన్నర్‌గా తన్మయి గ్రూప్ నిలిచారు. విజేతలకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ట్రోఫీలను అందించారు. ఇక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాంస్కృతిక సంబరం అంబరాన్నంటింది. కూచిపూడి నృత్యాలు, క్లారినెట్ ప్రదర్శనలు, జానపద నృత్యాలు అబ్బురపరచగా, ఘంటసాల సంగీత కళాశాలలో పాటల కచేరీలు, నాటికలు, నాటకాలు ఆకట్టుకున్నాయి.