Share News

జ్ఞానసముపార్జనకు గ్రంథాలయాలు

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:53 AM

నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ డిగ్రీ కాలేజీలో గ్రంథాలయం, సమాచారం శాస్త్ర విభాగం, ఎన్‌డీఎల్‌ఐ క్లబ్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్రంథా లయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది.

జ్ఞానసముపార్జనకు గ్రంథాలయాలు
బహుమతులు పొందిన విద్యార్థులతో ప్రిన్సిపాల్‌ భాగ్యలక్ష్మి, అధ్యాపకులు

జ్ఞానసముపార్జనకు గ్రంథాలయాలు

ఫ ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ భాగ్యలక్ష్మి

విజయవాడ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ డిగ్రీ కాలేజీలో గ్రంథాలయం, సమాచారం శాస్త్ర విభాగం, ఎన్‌డీఎల్‌ఐ క్లబ్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్రంథా లయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్‌, ఎన్‌డీఎల్‌ఐ క్లబ్‌ ప్యాట్రన్‌ కె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, ‘డ్రా టు ది లైబ్రరీ’ వారోత్సవంతో జరిగిన గ్రంథాలయ వారోత్సవాలు బహుముఖ పాత్రను ప్రతిబింబిస్తూ, పుస్తకాల పఠనానికే పరిమితం కాకుండా జ్ఞానసముపార్జనకు, సృజనాత్మకతను పెంపొందించేందుకు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయన్నారు. వారాంతరంలో వ్యాసరచన, వక్తత్వ, డ్రాయింగ్‌, పుస్తక సమీక్ష పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ లైబ్రేరియన్‌ జి.లుముంబా, అధ్యాపకులు డి.ఎస్‌.వి.ఎస్‌. బాలసుబ్రహ్మణ్యం, యూవీ రమణమూర్తి, కె.రమేష్‌, పద్మనాభం, ఎన్‌.జె.సుకుమార్‌, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 12:53 AM