కలిసికట్టుగా పనిచేద్దాం!
ABN , Publish Date - May 24 , 2025 | 12:38 AM
కృష్ణాజిల్లా పారిశ్రామికాభివృద్ధి, 2029 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ విజయం సాధించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని నాయకులు, కార్యకర్తలకు మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.
కష్టపడిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తాం
మచిలీపట్నంలో రెండెకరాల్లో పార్టీ జిల్లా కార్యాలయం
జిల్లా మినీ మహనాడులో మంత్రి కొల్లు రవీంద్ర
అధికారముందని జిల్లాకు చెందిన కొందరు కంచర గాడిదలు ఇష్టానుసారం ప్రవర్తించారు
ఇప్పుడు వారి పరిస్థితిని కళ్లారా చూస్తున్నాం: జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
కృష్ణాజిల్లా పారిశ్రామికాభివృద్ధి, 2029 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ విజయం సాధించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని నాయకులు, కార్యకర్తలకు మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. మచిలీపట్నంలోని ఓ ఫంక్షన్ హాలులో టీడీపీ జి ల్లా అఽధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన జిల్ల్లా మినీ మహానాడులో ఆయన మాట్లాడారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్రమ కేసులు, వేధింపులను తట్టుకుని టీడీపీ కార్యకర్తలు పార్టీని గెలిపించారని మంత్రి రవీంద్ర అన్నారు. వారి త్యాగాలకు వెలకట్టలేమన్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీ సముచితస్థానం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెబితే, ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగువారి కీర్తి, ప్రతిష్టలను మరింత పెంచేలా పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. టీడీపీలో గతంలో పనిచేసిన ఇద్దరు నాయకులు తెలంగాణకు ముఖ్యమంత్రులయ్యారంటే అది పార్టీ గొప్పతనమని అన్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని 216 జాతీయ రహదారి వెంబడి రెండెకరాల విస్తీర్ణంలో టీడీపీ జిల్లా కార్యాలయాన్ని ఏడాదిలోగా నిర్మిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వచ్చే ఏడాది మినీమహానాడును నూతన కార్యాలయంలో జరుపుతామని తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గంనుంచి టీడీపీ కార్యాలయానికి రూ.కోటి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా మొత్తాన్ని సీఆర్డీఏ పరిధిలోకి తెచ్చి, మచిలీపట్నం పోర్టును గేట్‌వే ఆఫ్ అమరావతిగా తీర్చి దిద్దుతామన్నారు. 8 వేల బస్తాల బియ్యం బొక్కేసిన పేర్నినాని నీతిసూత్రాలు చెబుతున్నాడని, మహిళలపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీకి రంగు దిగిందని, మరొకరు అనారోగ్య కారణాలు చూపి విదేశాలకు పారిపోయే ప్రయత్నాలో ఉన్నారని మంత్రి కొల్లు విమర్శించారు.
టీడీపీ స్థాపనకు ముందు ఢిల్లీలో శాసిస్తే..ఏపీలో పాలన సాగేది
గతంలో ఢిల్లీలో శాసిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో పాలన కొనసాగేదని, ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తరువాత తెలుగువారి ఆత్మగౌరవం వెల్లివిరిసిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. తండ్రి మరణాన్ని సాకుగా చూపి పార్టీని స్థాపించిన వైఎస్ జగన్ ఒక్కచాన్స్ ఇమ్మని ప్రజలను కోరి ఐదేళ్లపాటు చెత్తపాలన కొనసాగించారని ఆయన అన్నారు. జిల్లాకు చెందిన కొందరు కంచరగాడిదలు గతంలో అధికారంలో ఉన్నపుడు ఇష్టానుసారం ప్రవర్తించారని, ప్రజ లు పక్కన పెట్టడంతో, నేడు వారి పరిస్థితి ఎలా ఉందో కళ్లారా చూస్తున్నామని ఆయన అన్నారు. రానున్న రోజులలో కృష్ణాజిల్లాను అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుందని పార్టీ జిల్లా అఽధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు భరోసా ఇచ్చారు. కార్యకర్తల కష్టాలను పాదయాత్రలో లోకేశ్ చూశారని, వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులపాలైన కార్యకర్తలందరినీ ఆదుకుంటున్నారని, రెడ్‌బుక్‌లోపేర్లు నమోదైన వైసీపీ నాయకులపై చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా ఉంటాయని ఆయన స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్‌రాజా, వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావ్, బోడె ప్రసాద్, గిడ్డంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, ఆళ ్లగోపాలకృష్ణ, కనపర్తి శ్రీనివాసరావు ప్రసంగించారు. జిల్లా నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పేర్ని నానీ జైలుకెళ్లడం ఖాయం: వర్ల రామయ్య
పందికొక్కు మాదిరిగా పేదల బియ్యం బొక్కేసిన మాజీ మంత్రి పేర్ని నాని అక్రమాలు చాలా ఉన్నాయని, వాటన్నింటికి వెలికి తీస్తున్నామని, అతని నుంచి అవినీతి సొమ్మును కక్కించడంతోపాటు, జైలుకు పంపడం ఖాయమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో విర్రవీగి, టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన ఒక నాయకుడు జైలుపాలు కాగా, మరొకరు దేశాన్ని విడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, మరొకరు జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. జగన్‌ను నమ్ముకుని త ప్పులు చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నేడు జైలుపాలై నేలమీద పడుకుంటున్నారని ఆయన అన్నారు.
పార్టీ కార్యాలయం నిర్మాణానికి విరాళాలు
మచిలీపట్నంలో నిర్మించనున్న టీడీపీ జిల్లా కార్యాలయానికి మచి లీపట్నం నియోజకవర్గం నుంచి మంత్రి కొల్లు రవీంద్ర కోటి రూపా యలను ప్రకటించారు. దండమూడి చిన్నా రూ.3,77,077, యార్లగడ్డ సుచిత్ర రూ.లక్ష విరాళంగా ప్రకటించారు.
తీర్మానాలు..
‘మచిలీపట్నం పోర్టు పనులను త్వరితగతిన పూర్తిచేసి, పోర్టు అనుబంధ పరిశ్రమలను స్థాపించి, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. అసైన్డ్ భూముల ఇబ్బందులకు తొలగించాలి. మచిలీపట్నం-రేపల్లె రైలుమార్గం నిర్మించాలి. మచిలీపట్నంలో రైల్వే కోచ్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి. రోల్డ్‌గోల్డ్, ఆక్వా పరిశ్రమ లకు చేయూతనిచ్చేలా ఆర్థికతోడ్పాటును అందించాలి. రాష్ట్ర రహదా రులను జాతీయ రహదారులుగా మార్పు చేయాలి. మచిలీ పట్నం -విజయవాడ జాతీయర హదారి 65ను ఆరులేన్లుగా అభివృద్ధి చేయా లి. కత్తిపూడి-ఒంగోలు జాతీయరహదారి 216ఏను నాలుగు లేన్లుగా అభివృద్ది చేయాలి’ అని జిల్లా మహానాడులో తీర్మానించారు.