Share News

తాగునీటి ఎద్దడి రానివ్వం

ABN , Publish Date - Apr 13 , 2025 | 12:53 AM

వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూస్తామని ప్రజలకు మంత్రి కొల్లు రవీంద్ర హా మీ ఇచ్చారు.

తాగునీటి ఎద్దడి రానివ్వం
తరకటూరు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులో నీటి మట్టాన్ని పరిశీలిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర

మంత్రి కొల్లు రవీంద్ర హామీ

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూస్తామని ప్రజలకు మంత్రి కొల్లు రవీంద్ర హా మీ ఇచ్చారు. శనివారం తరకటూరు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకును ఆయన సందర్శించారు. నీటి మట్టం, తరకటూరు, బందరు పంపుల చెరువుల్లోని నీటి నిల్వలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమగ్ర రక్షిత మంచినీటి సరఫరాను పరిశీలించా రు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు సరఫరా చేయాలని మునిసిపల్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు ఆదేశించారు. తరకటూరు సమ్మర్‌ స్టోరేజీ నుంచి మచిలీప ట్నం నగరం, బందరు మండలం, పెడన, గూడూరు మండలాలకు తాగునీరు అందిస్తామన్నారు. తరకటూరు చెరువులను 450 సామర్థ్యం కల మోటార్లతో నీటిని తోడుతూ నింపే కార్యక్రమం చేపట్టామన్నారు. వారంలో నీటిని నింపే ప్రక్రియను పూర్తి చేస్తామన్నా రు. తరకటూరు సమ్మర్‌ స్టోరేజి సామర్థ్యం 5.1 మీటర్లు కాగా ప్రస్తుతం 4.5 మీటర్లు ఉందన్నారు. గత వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతుంటే 70 హెచ్‌పీ మోటార్లకు అదనంగా మరో 460 హెచ్‌ పీ మోటార్లకు ట్రాన్స్‌ఫార్మర్‌, ఇంజన్లను ఏర్పాటు చేశామన్నారు. మచిలీపట్నం పంపుల చెరువులో 13 అడుగుల సామర్థ్యానికి, ప్రస్తుతం 8 అడుగుల వరకు నీరు ఉందన్నారు. నీటిని నిల్వ చేసేందుకు అధికారు లు చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న 70 రోజులకు మంచినీటికి ఎలాంటి కొరత లేదన్నారు. తరకటూరు నుంచి మచిలీపట్నం వరకు పైపులైన్లు లీకు కాకుండా జాతీయ రహదారి అధికారులతో మాట్లాడి చర్యలు చేపడుతున్నామన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మంచినీటి కొరత లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రూ.2కోట్ల 40 లక్షలతో ఫిల్టర్‌బెడ్లకు నిధులు మంజూరు చేశామన్నారు. టెండర్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. కృష్ణానది నుంచి వాటర్‌ గ్రిడ్‌ ద్వారా బందరుకు పైపులైన్లు వేయించి ఇంటింటికీ కుళాయి వేయించి మంచినీరు సరఫరా చేస్తామని, దీనిపై సీఎంతో మాట్లాడామని తెలిపారు. మంత్రి వెంట జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండి రామకృష్ణ, మునిసిపల్‌ డీఈ రామప్రసాద్‌, ఏఈ రాజేశ్వరరావు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ నాగరాజు, జలవనరుల శాఖ ఏఈ హరీష్‌ ఉన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 12:53 AM