ప్లాస్టిక్ రహిత నగరంగా బందరును తీర్చిదిద్దుదాం
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:26 AM
ప్లాస్టిక్ రహిత నగరంగా బందరును తీర్చిదిద్దుదామని మునిసిపల్ కమిషనర్ బాపిరాజు పిలుపునిచ్చారు.

చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో కమిషనర్ బాపిరాజు
మచిలీపట్నం టౌన్, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్ రహిత నగరంగా బందరును తీర్చిదిద్దుదామని మునిసిపల్ కమిషనర్ బాపిరాజు పిలుపునిచ్చారు. బుధవారం చాంబర్ ఆఫ్ కామ ర్స్ ప్రతినిధులతో మునిపిపల్ కార్యాలయ సమావేశపు హాలులో నిర్వహించిన సమావేశంలో అఽధికారులతో బాపిరాజు మాట్లాడారు. ప్లాస్టిక్ వస్తువులు, క్యారీబాగ్‌లు, డిస్పోజల్ గ్లాసులు, ప్లాస్టి క్ లామినేషన్ ఉండే అట్ట టీ గ్లాసుల వాడకం మంచిది కాదని, వీటిని నిషేధించాలని కోరారు. ఇందుకు వ్యాపార, వాణిజ్యవేత్తలు సహకరించాలన్నారు. ఈ వస్తువుల అమ్మకాలకు ప్రత్యామ్నాయం చూపాలని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కోరారు. పెనాల్టీలలు పడకుండా వ్యాపార వర్గాలు సహకరించాలని చాంబర్ ఆఫ్ కామర్సు జిల్లా అధ్యక్షుడు మద్దుల గిరీష్ కోరారు. చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా కార్యదర్శి పల్లపోతు సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొన్నారు.