Share News

కలెక్టర్‌.. ప్రొ‘ఫైల్స్‌’

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:50 AM

ఫైళ్ల పరిశీలన, పరిష్కారంలో కృష్ణాజిల్లా యంత్రాంగం ముందు వరసలో నిలిచింది. ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం కాస్త వెనుకబడింది. కృష్ణా కలెక్టర్‌ డీకే బాలాజీ ఒక్క రోజులోపే తన దగ్గరకొచ్చిన ఫైళ్లను పరిశీలించి పరిష్కరిస్తుంటే, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశకు మాత్రం 8 రోజులకు పైగా సమయం పడుతోంది.

కలెక్టర్‌.. ప్రొ‘ఫైల్స్‌’

కృష్ణా కలెక్టర్‌ సూపర్‌.. ఎన్టీఆర్‌ కలెక్టర్‌ యావరేజ్‌

ఫైళ్ల పరిశీలన వివరాలు వెల్లడించిన సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోనే మొదటి వరుసలో కృష్ణా కలెక్టర్‌ బాలాజీ

ఫైళ్ల పరిశీలన, పరిష్కారంలో జేసీతో కలిసి స్పీడ్‌

ఒక్క రోజులోనే పరిష్కారం.. అందుకే ముందు వరస

ఫైల్‌ పరిశీలనకు మంత్రి కొల్లుకు 15 రోజుల సమయం

విజయవాడ/మచిలీపట్నం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ఫైళ్ల పరిశీలన, పరిష్కారంలో కృష్ణాజిల్లా యంత్రాంగం ముందు వరసలో నిలిచింది. ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం కాస్త వెనుకబడింది. కృష్ణా కలెక్టర్‌ డీకే బాలాజీ ఒక్క రోజులోపే తన దగ్గరకొచ్చిన ఫైళ్లను పరిశీలించి పరిష్కరిస్తుంటే, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశకు మాత్రం 8 రోజులకు పైగా సమయం పడుతోంది. ఈ ఫైళ్ల పరిశీలన, పరిష్కారానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

కలెక్టర్లు ఇలా..

  • కృష్ణాజిల్లా యంత్రాంగం రాష్ట్రంలోనే ముందు వరసలో ఉంది. 2024, జూలై 15 నుంచి 2025, డిసెంబరు 9 వరకు కృష్ణా కలెక్టర్‌ దగ్గరకు 1,725 ఫైళ్లు ఈ-ఆఫీస్‌ ద్వారా రాగా, వాటిలో 1,707 ఫైళ్లను పరిశీలించారు. ఒక్కో ఫైల్‌ను పరిశీలించి పరిష్కరించడానికి ఆయన సరాసరిన 16 గంటల 23 నిమిషాల సమయం తీసుకుంటున్నట్టుగా చూపారు.

  • ఎన్టీఆర్‌ జిల్లా విషయానికొస్తే.. కలెక్టర్‌ లక్ష్మీశ దగ్గరకు మొత్తం 2,666 ఈ పైళ్లు రాగా, వాటిలో 2,607 పరిశీలించినట్లుగా చూపారు. సరాసరిన ఒక్కో ఫైల్‌ చూడటానికి లక్ష్మీశకు 8 రోజుల 8.50 గంటల సమయం పట్టింది.

  • ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియాకు 5 రోజుల 11 గంటల సమయం పడుతోంది. ఇలక్కియా మొత్తం 823 ఈ ఫైల్స్‌ను స్వీకరించగా, 815 పరిశీలించారు.

మంత్రి కొల్లు రవీంద్ర పరిస్థితి

కృష్ణాజిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర వద్దకు ఇప్పటి వరకు 925 ఫైళ్లు రాగా, 912 పరిశీలించారు. ఒక్కో పైలును పరిశీలించడానికి సరాసరిన 15 రోజుల 5 గంటల 53 నిమిషాల సమయం తీసుకుంటున్నట్లుగా చూపారు. మూడు నెలల వ్యవఽధిలో రెండు జిల్లాల కలెక్టర్‌లు ఈ-ఆఫీస్‌ ఫైళ్లను పరిశీలించడంలో కొంతమేర చురుగ్గావ్యవహరిస్తున్నట్టుగా చూపారు.

Updated Date - Dec 12 , 2025 | 12:50 AM