కేజీఎఫ్‌లో కిలేడీ
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:47 AM
అవి న్యూ రాజరాజేశ్వరీపేటలోని జేఎన్‌ఎన్యూఆర్‌ఎం అపార్టుమెంట్లు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలు. మహిళలే కాదు.. మగవారు సైతం అటుగా వెళ్లాలంటే భయపడతారు. అందుకే దీనిని కేజీఎఫ్ అపార్ట్‌మెంట్‌గా పిలుస్తుంటారు. అలాంటి ఈ ప్రాంతంలో ఓ మహిళా డాన్ తిష్ట వేసుకుని కూర్చుంది. ప్రభుత్వ ఇళ్లను సొంత ఆస్తుల మాదిరిగా అమ్మేస్తోంది. మరికొన్ని ఇళ్లను పేదలకు అద్దెలకు ఇచ్చి నెలవారీ వసూళ్లు చేస్తోంది. ఇంతా జరుగుతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.
న్యూఆర్‌ఆర్‌పేట ఎన్యూఆర్‌ఎం ఇళ్ల వద్ద తిష్ట
ఖాళీగా ఉన్న ఫ్లాట్లు పేదలకు విక్రయం
మరికొన్ని అద్దెలకు ఇస్తూ నెలవారీ వసూళ్లు
నకిలీ స్లిప్పులు సృష్టించి ఏళ్ల తరబడి మాయ
డబ్బు ఇచ్చి మోసపోతున్న అమాయక పేదలు
సుపరిపాలనకు తొలి అడుగులో టీడీపీ నేతల గుర్తింపు
ఎమ్మెల్యే బొండా ఉమా దృష్టికి.. కమిషనర్‌కు లేఖ
అజితసింగ్‌నగర్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : 2011లో అప్పటి ప్రభుత్వం నగరంలోని పేదలు, కాల్వగట్లపై ఉంటున్న వారికోసం న్యూఆర్‌ఆర్‌పేట ప్రాంతంలో ఇళ్లు నిర్మించ తలపెట్టింది. 2017లో నిర్మాణం పూర్తయింది. 16 బ్లాక్‌లలో ఒక్కో బ్లాక్ 32 ఇళ్ల చొప్పున మొత్తం 512 ఇళ్లు నిర్మించిన ప్రభుత్వం పేదలకు వాటిని కేటాయించింది. అయితే, 512 ఇళ్లకు గానూ సుమారు 250 కుటుంబాలకు ఇళ్లు కేటాయించి మిగిలిన వాటిని అలాగే వదిలేశారు. స్థానికంగా మౌలిక సదుపాయాలు లేకపోవడంతో లబ్ధిదారులెవరూ ఇక్కడికి రాలేదు. అనుకూలంగా మార్చుకుంది. ఖాళీగా ఉన్న ఇళ్లకు నకిలీ స్లిప్‌లను తయారుచేసి అవన్నీ తన ఆధీనంలోనే ఉన్నాయని నమ్మించింది. ఇవన్నీ తెలియని అమాయక పేదలు ఆమె వద్ద ఇళ్లు కొంటున్నారు.
సొంత ఆస్తుల్లా అమ్మేస్తున్న మహిళా డాన్
పేదల జాబితాలో ఇక్కడ ఇల్లు పొందిన ఓ మహిళ అందరికీ తలనొప్పిగా మారింది. లబ్ధిదారురాలిగా వచ్చిన ఆమె ఖాళీగా ఉన్న ఇళ్లపై కన్నేసింది. ముందుగా తాను నివాసం ఉంటున్న బ్లాక్‌లో ఖాళీగా ఉన్న ఓ ఇంటిని ఎంపిక చేసుకుని చర్చి ఏర్పాటు చేసుకుంది. అయినా అధికారులెవరూ అడగకపోవడంతో ఖాళీగా ఉన్న ఇళ్ల నెంబర్ల జాబితాను సిద్ధం చేసుకుంది. ప్రభుత్వం గతంలో ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా కేవలం స్లిప్‌ల సహాయంతో ఇళ్లు కేటాయించిన తీరును తనకు
నాలుగేళ్లలో అమ్మకాలు
కేజీఎఫ్ అపార్ట్‌మెంట్లలోని అనేక ఇళ్లను మహిళా డాన్ అమ్మేసినట్లు సమాచారం. నకిలీ స్లిప్‌లు తయారు చేయించి సుమారు 25 నుంచి 35 వరకు ఇళ్లు అమ్మినట్టు తెలుస్తోంది. రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు అమ్మి సొమ్ము చేసుకున్నట్లు అక్కడివారు చెబుతున్నారు. మరోపక్క ఇళ్లను అద్దెలకు కూడా ఇచ్చేస్తోంది. ఒక్కో ఇంటికి నెలకు రూ.1,500 నుంచి రూ.2 వేలు వసూలు చేస్తోంది. ఇలా సుమారు 20 మంది ఈమె వద్ద ఇళ్లు కొనుగోలు చేయగా, మరో 30 మంది వరకూ ఈమె ఆధీనంలో అద్దెకు ఉంటున్నారు. ఈ విషయాన్ని సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ నేతలు గుర్తించారు. ఎమ్మెల్యే బొండా ఉమాకు తెలిపారు. ఈ తతంగాన్ని ఎమ్మెల్యే నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లారు. 300 ఇళ్లు ఖాళీగా ఉన్నాయని, అవన్నీ అన్యాక్రాంతమవుతున్నాయని, ఆ విషయమై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.