Share News

కవితకు పవన్‌ను విమర్శించే హక్కులేదు

ABN , Publish Date - Apr 11 , 2025 | 01:07 AM

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను విమర్శించే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు లేదని జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ అన్నారు.

కవితకు పవన్‌ను విమర్శించే హక్కులేదు

జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను విమర్శించే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు లేదని జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ అన్నారు. గురువారం తన కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. హిందీ భాష జాతీయ భాషగా అందరికీ తెలిసిందే అని, జాతీయభాషను గౌరవించాలని డిప్యూటీ సీఎం చెప్పారని అన్నారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన ఎమ్మెల్సీ కవిత తాను కూడా ఏదో ఒక విమర్శ చేసి పత్రికలకు ఎక్కాలనే తాపత్రయంతో పవన్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో త్రిభాషా సూత్రం పాఠశాలల్లో అమలు జరుగుతోందన్నారు. ద్వితీయ భాషగా హిందీని పాఠశాలల్లో అమలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తే మాజీ మంత్రి పేర్ని నానీ అవాకులు, చెవాకులు పేలారని, అప్పట్టో ఎమ్మెల్యే హోదాలో ఉన్న పేర్ని నానీ తన కుమారడు కిట్టును ప్రభుత్వ అధికార కార్యక్రమాలను పంపారని అన్నారు. ఆ సంగతిని పేర్ని నానీ మర్చిపోయారా..అని నిలదీశారు. ఎవరి పార్టీల నాయకులను వారు అధికారంలో ఉండగా గౌరవించుకోవడం తప్పులేదన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 01:07 AM