కస్తూర్భా ఉపాధ్యాయుల శిక్షణ వాయిదా వేయాలి
ABN , Publish Date - May 26 , 2025 | 12:45 AM
కస్తూర్భా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఈనెల 26నుంచి 30వ తేదీ వరకు మారీస్ స్టెల్లా కళాశాలలో నిర్వహించే శిక్షణ తరగతులను వాయిదా వేయాలని ఏఐఎ్‌సఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్ డిమాండ్ చేశారు.
ఏఐఎ్‌సఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికుమార్ డిమాండ్
బెంజిసర్కిల్, మే 25(ఆంధ్రజ్యోతి): కస్తూర్భా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఈనెల 26నుంచి 30వ తేదీ వరకు మారీస్ స్టెల్లా కళాశాలలో నిర్వహించే శిక్షణ తరగతులను వాయిదా వేయాలని ఏఐఎ్‌సఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యే వారిలో ఎ క్కువ మంది కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు ఉన్నారని, వీరు డీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారని, దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టిసారించాలని కోరారు. లేనిపక్షంలో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయుల పక్షాన నిలిచి సోమవారం నుంచి జరిగే శిక్షణ తరగతులను అడ్డుకుంటామని సాయికుమార్ పేర్కొన్నారు.