Share News

ఇన్ఫోసిస్‌లో పీబీ సిద్ధార్థ విద్యార్థులకు ఉద్యోగాలు

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:38 AM

పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగావకాశాలు లభించినట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌ చెప్పారు.

ఇన్ఫోసిస్‌లో పీబీ సిద్ధార్థ విద్యార్థులకు ఉద్యోగాలు
విద్యార్థులతో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌, డైరెక్టర్‌ వేమూరి బాబూరావు, కావూరి శ్రీధర్‌

ఇన్ఫోసిస్‌లో పీబీ సిద్ధార్థ విద్యార్థులకు ఉద్యోగాలు

మొగల్రాజపురం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగావకాశాలు లభించినట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌ చెప్పారు. మంగళవారం కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత నెల గుంటూరు కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన ఆన్‌లైన్‌ పరీక్షలో, ఇంటర్యూలలో ఉత్తీర్ణులై అత్యుత్తమ ప్రతిభ కనబరచిన 15 మంది విద్యార్థులు సిస్టిం అసోసి యేట్స్‌గా ఎంపికయ్యారని చెప్పారు. ఉపాధి అవకాశాలు పొందిన వారిని డైరెక్టర్‌ వేమూరి బాబూరావు, డీన్‌ రాజేష్‌ జంపాల, ఉపాధి శిక్షణా అధికారి కావూరి శ్రీధర్‌, సిద్ధార్థ అకా డమీ ప్రతినిధులు అభినందించారు.

ఫ సర్టిఫికెట్‌ల బహుకరణ

పీబీ సిద్ధార్థ కళాశాల మహిళా సాధికారత ఆధ్వర్యంలో ఎంపవర్‌ హర్‌ అనే కార్యక్రమం ద్వారా కుట్టుపని, బ్యూటీషియన్‌ సర్టిఫికేట్‌ కోర్సులు పూర్తి చేసిన వారికి మంగళవారం సర్టిఫికెట్‌లు బహుకరించారు. జాతీయ స్థాయిలో ఈత పోటీలలో విజేతగా నిలిచిన జి.విజయశ్రీ గుప్తా, మీనాక్షి ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షురాలు మీనాక్షి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని సర్టిఫికెట్‌లు అందించారు.

మహిళా సాధికారిత కమిటీ అధ్యక్షురాలు ఏ. కవిత, సువర్ణాంజలి, వెంకటరమణ, శ్రీరేఖ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 12:38 AM