Share News

రాజధానిలో జాబ్‌మేళాకు విశేష స్పందన

ABN , Publish Date - Jun 19 , 2025 | 12:56 AM

రాజధాని ప్రాంతంలోని స్కిల్‌హబ్‌ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. మొత్తం 264 మంది అభ్యర్థులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనగా, 110 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు.

రాజధానిలో జాబ్‌మేళాకు విశేష స్పందన
అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న అధికారులు

110 మందికి ఉద్యోగాలు

విజయవాడ, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి) : రాజధాని ప్రాంతంలోని స్కిల్‌హబ్‌ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. మొత్తం 264 మంది అభ్యర్థులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనగా, 110 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. మరో 137 మంది రెండో రౌండ్‌కు ఎంపికయ్యారు. సీఆర్డీఏ ఆధ్వర్యంలో నైపుణాభివృద్ధి, శిక్షణ శాఖ నిర్వహించిన ఈ జాబ్‌మేళాలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఆటోమొబైల్‌, ఫైనాన్స్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రంగాలకు చెందిన ఐదు ప్రముఖ కంపెనీలైన వరుణ్‌ మోటార్స్‌, స్కిల్‌క్రాఫ్డ్‌ లిమిటెడ్‌, ఎంవీఆర్‌ ఇన్‌ఫ్రా, కేఎంవీ ప్రాజెక్టు, శ్రీరామ్‌ ఫైనాన్స్‌ సంస్థలు పాల్గొన్నాయి. ఈ కంపెనీల్లో 400 ఉద్యోగాలు భర్తీ చేయడానికి జాబ్‌మేళా నిర్వహించారు. ప్రపంచ బ్యాంక్‌, ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ బృందాలు స్కిల్‌హబ్‌ ప్రాంగణంలో పర్యటించి అభ్యర్థులతో మాట్లాడాయి. ఇంటర్వ్యూలు జరిగిన తీరును పరిశీలించాయి. నైపుణ్య శిక్షణాధికారి సాయిశ్రీనివాస్‌, ప్లేస్‌మెంట్‌ అధికారి అరుణకుమారి బాధ్యతలు నిర్వహించగా, ఎన్‌ఏసీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వి.నరసింహారావు, సీఆర్డీఏ డీసీడీవో బి.శ్రీనివాసరావు, సీనియర్‌ లైవ్‌లీహుడ్‌ ఆఫీసర్‌ శంకర్‌ తదితరులు విధులు నిర్వహించారు.

Updated Date - Jun 19 , 2025 | 12:56 AM